కమలం ఆపరేషన్ అంత సులువు కాదా ?

రామ్ మాధవ్ బిజెపి లో అత్యంత శక్తిమంత నాయకుడు గా ఎదిగారు. ఆయనకు అప్పగించిన ఆపరేషన్ ఏది ఇప్పటివరకు ఫెయిల్ కాకపోవడంతో కాషాయదళం కి ఆయనపై ఎంతో [more]

Update: 2020-08-18 03:30 GMT

రామ్ మాధవ్ బిజెపి లో అత్యంత శక్తిమంత నాయకుడు గా ఎదిగారు. ఆయనకు అప్పగించిన ఆపరేషన్ ఏది ఇప్పటివరకు ఫెయిల్ కాకపోవడంతో కాషాయదళం కి ఆయనపై ఎంతో నమ్మకం. కాశ్మీర్ వంటి క్లిష్టమైన చోట పార్టీ ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ కి తన జన్మభూమి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ని అత్యున్నత స్థాయిలో చూడాలన్నది దశాబ్దాలుగా ఒక కల. అయితే ఆ కల సాకారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు గతం నుంచి ఏ మాత్రం అనుకూలంగా లేవు. ప్రస్తుతం సంక్లిష్టమే. ఆయన వెనుక ఒక ప్రత్యేక టీం పనిచేస్తూ ఉంటుంది. బిజెపి విజయాల్లో రామ్ మాధవ్ వ్యూహాలు గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నాయని కూడా అంటారు.

మోడీ టీం అందుకే మిషన్ ఇచ్చింది …

అందుకే మోడీ టీం మాత్రం మరోసారి నమ్మకంతో రామ్ మాధవ్ కి తెలుగు రాష్ట్రాల్లో కమల వికాసానికి బాటలు వేయాలని మిషన్ అప్పగించింది. ఆయన యధావిధిగా రంగంలోకి దిగారు. గతంలో లా కాకుండా తనకు అన్ని అధికారాలను అప్పగిస్తే సత్తా చూపేందుకు ప్రయత్నం చేస్తానని అధిష్టానం కి మాటిచ్చారని తెలుస్తుంది. అందుకే తన కొర్ టీం ను ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల్లో ఆరెస్సెస్ హార్డ్ కొర్ వ్యక్తులకే పీఠాలు దక్కేలా ఆచితూచి వేచి అడుగులు వేశారు రామ్ మాధవ్. పార్టీ అధిష్టానం పెద్దలు ఇచ్చిన స్వేచ్ఛతో ఆపరేషన్ తెలుగు స్టేట్స్ మొదలు పెట్టేశారు ఆయన. దీనికి సంబంధించి దిశా దశా నిర్దేశించడానికి ఎంతో బిజీ షెడ్యూల్స్ ఉన్నా తరచూ అటు హైదరాబాద్ ఇటు అమరావతి లకు రామ్ మాధవ్ వస్తూ వెళుతున్నారు.

అధికారం మన స్లోగన్ కాకూడదు …

ముందుగా రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఆ స్థానం ఆక్రమించాలన్నది ఆయన పార్టీ శ్రేణులకు ఇస్తున్న ప్రధాన సందేశం. ఎన్నికలు సమీపించే నాటికి ఆ పని పూర్తి చేయగలిగితే చాలని అధికారంలోకి ఎలా రావాలన్నది రెండో అడుగు అన్నది రామ్ మాధవ్ ఆలోచనగా కనిపిస్తుంది. 2024 లో అధికారమే లక్ష్యం అని చేతులు కట్టుకుని కూర్చుంటే 2029 లో కూడా అది స్లోగన్ గానే మారుతుందని శ్రేణులకు రామ్ మాధవ్ తేల్చి చెప్పేశారు. కేంద్రం లో అధికారంలో ఉన్నది బిజెపి నే కావడంతో ప్రధాన పక్షాలను చాపచుట్టేయడం ఇప్పుడు బిజెపి శరవేగంగా చేయనుంది.

అక్కడ ఇక్కడ విపక్షాలకు …

ప్రజల పక్షాన తమ గొంతు మాత్రమే వినిపించాలన్న ఆలోచనతో కమలం వేస్తున్న ఈ అడుగులు తెలంగాణ లో కాంగ్రెస్ కి ఎపి లో టిడిపి కి వణుకు పుట్టిస్తున్నాయి. బిజెపి గట్టిగా కన్నెర్ర చేస్తే తమ పార్టీలకు ఆర్ధికంగా ఇంతకాలం దన్నున్న వారంతా జారిపోతారు. వారు పోతే శ్రేణులు కదనరంగంలో తప్పుకుంటాయి. ఈ అంకంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల మీడియా ను ముందుగా గట్టిగా నియంత్రించే పని కూడా తెరవెనుక మొదలైందంటున్నారు. తమ గొంతు వినిపించకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉండబోతాయన్న పరోక్ష హెచ్చరికలతో భయపడ్డ వివిధ పార్టీలకు మద్దత్తుగా నిలిచే ప్రచార సాధనాలు ఇటీవల బిజెపి ప్రధాన నేతలను తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా హై లెట్ చేయక తప్పడం లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ మాధవ్ అనుసరించనున్న వ్యూహాలు ఆసక్తికరం కానున్నాయి.

Tags:    

Similar News