తలైవా పై ఎటాక్ మొదలయిందిగా?

తమిళనాడులో రజనీకాంత్ పార్టీ పెట్టకముందే ఆయనపై మాటల దాడి మొదలయింది. రజనీకాంత్ ను మానసికంగా దెబ్బతీసేందుకు రాజకీయ పార్టీలు రెడీ అయినట్లే కన్పిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, [more]

Update: 2020-12-17 18:29 GMT

తమిళనాడులో రజనీకాంత్ పార్టీ పెట్టకముందే ఆయనపై మాటల దాడి మొదలయింది. రజనీకాంత్ ను మానసికంగా దెబ్బతీసేందుకు రాజకీయ పార్టీలు రెడీ అయినట్లే కన్పిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు మాత్రం రజనీకాంత్ విషయంలో సంయమనం పాటిస్తుండగా, చిన్న పార్టీలు రజనీకాంత్ పై ఎటాక్ కు సిద్దమయ్యాయి. రజనీకాంత్ ఈ నెల 31వ తేదీన పార్టీని ప్రకటిస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

డీఎంకే సంయమనంతో…..

అయితే ఇప్పటి వరకూ డీఎంకే కూటమిలో ఉన్న పార్టీలు ఈసారి తమకే అధికారం అని భావించాయి. డీఎంకేతో సీట్ల సర్దుబాటుకు రెడీ అయిపోయాయి. అయితే రజనీకాంత్ పార్టీ ప్రకటనతో డీఎంకేతో పాటు దాని కూటమిలోని పార్టీలు కూడా ఇబ్బందిలో పడ్డాయి. అయితే డీఎంకే దీనిపై ఆచితూచి వ్యవహరిస్తుంది. రజనీకాంత్ పై ఏమాత్రం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దాని ప్రభావం తమ విజయం పై ఉంటుందని డీఎంకే అధినేత స్టాలిన్ భావిస్తున్నారు.

వెనక ఆర్ఎస్ఎస్ అంటూ….

అయితే తమిళనాడులోని చిన్నా చితకా పార్టీలు మాత్రం రజనీకాంత్ ను వదిలిపెట్టడం లేదు. రజనీకాంత్ పార్టీ పెట్టడాన్ని తప్పు పట్టకపోయినా, పార్టీ పెడుతున్న విధానాన్ని అవి తప్పు పడుతున్నాయి. రజనీకాంత్ పార్టీ పెట్టడం వెనక ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఉన్నట్లు వీసీకే నేత తిరుమావళవన్ విమర్శలుచేశారు. బీజేపీ ప్రమేయంతోనే వత్తిడికి గురై రజనీకాంత్ పార్టీ పెడుతున్నట్లు ఆయన ఆరోపించడం తమిళనాట చర్చనీయాంశమైంది.

వారికి పదవులా?

ఇక సీపీఎం కూడా రజనీకాంత్ ను వదలడం లేదు. రజనీకాంత్ సినిమాలు విడుదల చేసినట్లు పార్టీ ప్రకటిస్తున్నట్లు ఉందని సీపీఎం నేత బాలకృష్ణన్ ఎద్దేవా చేశారు. ఎలాంటి కసరత్తు లేకుండానే పార్టీ పెడుతున్నారంటే దీని వెనక ఎవరో ఉన్నారని అనుమానం కలుగుతుందన్నారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ సయితం తీవ్ర విమర్శలు చేశారు. మూడేళ్ల నుంచి రజనీ మక్కల్ మండ్రంలో నేతలకు కాకుండా బీజేపీలో పనిచేసి వచ్చిన అర్జునమూర్తికి, అన్ని పార్టీల్లో చేరి వచ్చిన మణియన్ లకు పదవులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. మొత్తం మీద రజనీకాంత్ పై పార్టీ ఏర్పాటుకు ముందే ఎటాక్ ప్రారంభమయింది.

 

Tags:    

Similar News