వీక్ చేస్తున్నారుగా…. అయిపోయారుగా

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపుడుతుంది. అయినా రజనీకాంత్ ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. అయితే ఈ లోపు రజనీకాంత్ ను వీక్ చేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తు [more]

Update: 2020-12-01 18:29 GMT

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపుడుతుంది. అయినా రజనీకాంత్ ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. అయితే ఈ లోపు రజనీకాంత్ ను వీక్ చేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తు న్నాయి. ఇప్పటికే రజనీకాంత్ యాభై శాతం బలహీన పడిపోయారన్న విశ్లేషణలు వినపడు తున్నాయి. రజనీకాంత్ 2017లో పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. మూడేళ్లుగడుస్తున్నా రజనీకాంత్ పార్టీని ప్రకటించే ధైర్యం చేయలేకపోతున్నారు.

ఎన్నికలకు ఇంకా….

ఇంకా ఎన్నికలకు ఆరేడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే రజనీకాంత్ సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలు చేపట్టినా ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని డీఎంకే భావిస్తుంది. రజనీకాంత్ ను పార్టీ పెట్టకుండా డీఎంకే అన్ని విధాలుగా అడ్డుకుంటుందని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ పార్టీ పెడితే అది అధికార పార్టీ కంటే డీఎంకే కంటే ఎక్కువ నష్టమని అంచనాలు ఉండటంతో డీఎంకే ఈ విధమైన ప్రచారం మొదలుపెట్టింది.

వివరణ ఇచ్చుకున్నా…..

అయితే తనను ఎవరూ బెదిరించలేదని, బెదిరించబోరని రజనీకాంత్ తన అభిమానులకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సమయం వచ్చినప్పుడు పార్టీని ప్రకటిస్తానని ఆయన చెప్పడం విశేషం. ఇక రజనీకాంత్ పార్టీ పెడుతున్నారని, అందులోకూటమిలో చేరతామంటూ పీఎంకే వంటి పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. తమకు ఎక్కువ స్థానాలను కేటాయించకపోతే రజనీ వైపు వెళతామని కొన్ని పార్టీలు బ్లాక్ మెయిల్ కు కూడా దిగాయి.

బీజేపీ ముద్ర వేసి…..

ఇక బీజేపీ మరో అడుగు ముందుకేసింది. చెన్నైకి వచ్చిన అమిత్ షా రజనీకాంత్ ను కలవాలనుకున్నారు. అది సాధ్యం కాలేదు. దీంతో రజనీకాంత్ సన్నిహితుడు గురుమూర్తితో అమిత్ షా సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా రజనీకాంత్ ప్రచారం చేయాలని ఈ సందర్భంగా అమిత్ షా కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిని ఎవరూ ఖండించలేదు. ఇలా రజనీకాంత్ ను పార్టీ పెట్టక ముందే రాజకీయంగా బలహీన పర్చేందుకు తమిళనాడులో అన్ని పార్టీలు మైండ్ గేమ్ ప్రారంభించాయనే చెప్పాలి.

Tags:    

Similar News