ఇక్కడ వేడెక్కిన రాజకీయం .. దూసుకుపోతున్నారు

రాజకీయ చైతన్య కెరటం రాజమహేంద్రిలో కరోనా విజృంభణకు మించి నేతలు విజృంభిస్తున్నారు. అతి త్వరలో కార్పొరేషన్ ఎన్నికలకు గంట కొట్టేస్తారన్న టెన్షన్ తో అధికార వైసిపి ప్రధాన [more]

Update: 2021-04-27 00:30 GMT

రాజకీయ చైతన్య కెరటం రాజమహేంద్రిలో కరోనా విజృంభణకు మించి నేతలు విజృంభిస్తున్నారు. అతి త్వరలో కార్పొరేషన్ ఎన్నికలకు గంట కొట్టేస్తారన్న టెన్షన్ తో అధికార వైసిపి ప్రధాన ప్రతిపక్షం టిడిపి కత్తులు ఎడా పెడా నూరేస్తున్నాయి. నిత్యం మీడియా సమావేశాలు, సభలు, కార్యక్రమాలు జోరుగా నడుస్తున్నాయి. డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల అంశంపై ఇరు పక్షాలు గట్టిగా దృష్టి సారించాయి. ఇటీవల స్థానిక ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నిండిపోవడంతో నేతలు వారిలో ధైర్యాన్ని ఉత్సహాన్ని నింపేందుకు కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు.

గోడలు దూకేస్తున్నారు …

టిడిపి నేతలు ఎంత ధైర్యం నూరిపోస్తున్నా మీకు అండగా దండగా ఉంటామని భరోసా ఇస్తున్నా బలమైన నేతలు అధికార వైసిపి లోకి దూకేస్తున్నారు. వీరిలో చాలామంది మాజీ కార్పొరేటర్లు కావడం గమనార్హం. అయితే కొత్తగా వైసిపి లోకి వస్తున్న వారితో అధికారపార్టీ కళకళలాడుతున్న వివిధ డివిజన్ల పై ఆశలు పెంచుకున్న ఫ్యాన్ పార్టీ కి చెందిన కొందరిలో ఆందోళన మొదలైంది. కొత్తగా వచ్చినవారికి టిక్కెట్ హామీ లభిస్తే తమ గతేమి అవుతుందన్న బెంగ వారిలో మొదలైంది. సీనియర్ నేతలు ఫ్యాన్ కింద సేద తీరడాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు సైకిల్ దిగిపోవడానికి రెడీ గా ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికల ప్రకటన వచ్చాకా కొందరు దానికి ముందు మరికొందరు వచ్చేలా అధికారపార్టీ ప్లాన్ చేసినట్లు ప్రచారం నడుస్తుంది.

గోరంట్ల, ఆదిరెడ్డి కలిస్తేనే …

టిడిపి వర్గాల్లో మరో బెంగ ఉంది. పసుపు పార్టీలో సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల నడుమ సమన్వయం సాధ్యం అయితేనే అధికారపార్టీకి ఎదురొడ్డి పోరాడగలమని కానీ ప్రస్తుతం ఆ సీన్ కనుచూపు మేరలో కనిపించడం లేదని ఆ పార్టీలో వారే భావిస్తున్నారు. దాంతో రాజమండ్రి కార్పొరేషన్ లో మేయర్ స్థానాన్ని హ్యాట్రిక్ గా గెలుచుకువచ్చిన తెలుగుదేశం నాలుగోసారి తామే గెలుస్తామన్న ధీమా పైకి వ్యక్తం చేస్తున్నా లోలోపల అనుమానాలు వ్యక్తం చేస్తుందంటున్నారు.

వైసిపి లో ఇంకా సెట్ కాలేదు …

ఇక అధికారపార్టీ లో గ్రూప్ లు ప్రస్తుతం సైలెంట్ అయినా కార్పొరేషన్ ఎన్నికల టిక్కెట్ల సమయంలో బయటపడే అవకాశాలు ప్రస్ఫుటం గా కనిపిస్తున్నాయి. జగన్ హవా తో ఈసారి టిక్కెట్ దక్కించుకుంటే చాలు విజయం అదే దక్కుతుందన్న నమ్మకంతో అధికారపార్టీలో ఒక్కో డివిజన్ నుంచి ముగ్గురు నలుగురు సీట్లు ఆశించే వారు సిద్ధం అయిపోయారు. వీరికి తోడు టిడిపి నుంచి వచ్చే వారికి బెర్త్ లు కేటాయించాల్సి ఉంటుంది. దాంతో బెర్త్ ఎవరికి దక్కుతుందో ఉత్కంఠ రెక్కేత్తించే అంశమే. రాజమండ్రి కార్పొరేషన్ లో విజయం సాధించి తీరాలని ఇప్పటికే అధినేత జగన్ నేతలందరికి లక్ష్య నిర్దేశ్యం చేశారు. అంతే కాదు ఏ మాత్రం తేడా కొట్టినా నేతల ప్రయార్టీలు ఉల్టా పల్టా అవుతాయని సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి రాజకీయాలు ఎండలను మించి మండిపోతున్నాయి.

Tags:    

Similar News