ఒక్క ఛాన్స్ ప్లీజ్

మహారాష్ట్ర ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వేడి మరింత పెరుగుతోంది. అధికార బీజేపీ, శివసేన పార్టీలు రెబెల్స్ బెడదతో సతమత మవుతున్నాయి. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ కూడా [more]

Update: 2019-10-15 16:30 GMT

మహారాష్ట్ర ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వేడి మరింత పెరుగుతోంది. అధికార బీజేపీ, శివసేన పార్టీలు రెబెల్స్ బెడదతో సతమత మవుతున్నాయి. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ కూడా కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎన్ని స్థానాలను గెలుచుకుంటుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ రాజ్ థాక్రే చేస్తున్న ప్రచారం మహారాష్ట్రలో విశేషంగా ఆకట్టుకుంటుంది.

అసంతృప్తిగా ఉన్నవారంతా…..

శివసేన, బీజేపీలపై అసంతృప్తిగా ఉన్న వారంతా రాజ్ థాక్రేకు జై కొట్టే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా. రాజ్ థాక్రే ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. తనకు ఈసారైనా ఒక ఛాన్స్ ఇవ్వమని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తాను బీజేపీ, శివసేన, కాంగ్రెస్ లకు సమాన దూరంగా ఉంటానని, ప్రజా సమస్యల కోసం, మరాఠాల డిమాండ్ల సాధన కోసమే తన పార్టీ ఉందని బహిరంగ సభల్లో రాజ్ థాక్రే హామీలు ఇస్తున్నారు.

పదేళ్ల తర్వాత అదే సీన్…..

నిజానికి రాజ్ థాక్రే చీల్చే ఓట్లు శివసేనకు, బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశాలే ఎక్కువ. 2009లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఇదే జరిగింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన 13 అసెంబ్లీ స్థానాలను సాధించి ఆ ఎన్నికల్లో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, శివసేన ఓటు బ్యాంకుకు రాజ్ థాక్రే అప్పట్లో గండి కొట్టగలిగారు. అయితే మళ్లీ పదేళ్ల తర్వాత అదే సీన్ రిపీట్ అవుతుందేమోనన్న ఆందోళన శివసేనలో లేకపోలేదు.

విన్నూత్న ప్రచారంతో…..

ఎన్నడూ లేనిది బాల్ థాక్రే కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావవడం, పోటీ చేయడం కూడా మహరాష్ట్రలో చర్చనీయాంశమయింది. ఇది కూడా రాజ్ థాక్రేకు లాభించే అవకాశముం దంటున్నారు. రాజ్ థాక్రే పార్టీ ఎంఎన్ఎస్ ప్రస్తుత ఎన్నికల్లో 104 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగింది. అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా అత్యధిక సీట్లు సాధిస్తే కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసమే రాజ్ థాక్రే తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రచారం చేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో రాజ్ థాక్రే ఏమేరకు ప్రభావితం చేస్తారన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News