రాహుల్ అన్యాయం జరిగిందని అంగీకరించినట్లేగా?

కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా పట్ల సానుకూలతతోనే ఉన్నారు. తన మిత్రుడు, సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియా తన పార్టీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు [more]

Update: 2020-03-13 17:30 GMT

కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా పట్ల సానుకూలతతోనే ఉన్నారు. తన మిత్రుడు, సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియా తన పార్టీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించినా రాహుల్ గాంధీ నోటి నుంచి హార్ష్ కామెంట్స్ సింధియా గురించి రాలేదు. అంటే సింధియాకు పార్టీలో అన్యాయం జరిగిందని రాహుల్ గాంధీ పరోక్షంగా అంగీకిరించినట్లే.

సీనియర్ నేతల వల్లనే…..

నిజానికి మధ్యప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను చూసిన ఏ కాంగ్రెస్ నేత అయినా జ్యోతిరాదిత్య సింధియాను తిట్టక మానరు. పార్టీ సుదీర్ఘకాలం ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేసేవారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం జ్యోతిరాదిత్య సింధియా విషయంలో పార్టీ తప్పిదమే ఉన్నట్లు రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సీనియర్ నేతల వ్యవహార శైలి కారణంగానే సింధియా పార్టీని వీడినట్లు రాహుల్ విశ్వసిస్తున్నారు.

కనీస జోక్యం లేకపోవడంతో….

అందుకే మధ్యప్రదేశ్ విషయంలో రాహుల్ జోక్యం చేసుకోలేదు. కనీసం ముఖ్యమంత్రి కమల్ నాధ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించలేదు. మిగిలి ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ధైర్యం నింపేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించలేదు. ఇందుకు కారణం సీనియర్ నేతలపై ఉన్న ఆగ్రహమే కారణమంటున్నారు. సింధియా నిష్క్రమణపై సీనియర్ నేతల ఎదుట రాహుల్ గాంధీ తన అసహనం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కష్టపడినా ఫలితం లేక….

జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దగ్గరుండి ఎన్నికల సమయంలో చూశారు. అయితే తీరా గెలిచిన తర్వాత సింధియాకు అన్యాయం జరిగిందన్నది రాహుల్ కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. అందుకే ఆయన సింధియా పట్ల సానుకూలతగా ఉన్నారు. తిరిగి తన వద్దకు వస్తారని రాహుల్ గాంధీ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే సింధియా పై రాహుల్ విమర్శలు చేయడం లేదన్నది వాస్తవం.

Tags:    

Similar News