రాహుల్ సిద్ధమయ్యారట.. సంకేతాలు అలాగే?

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై రాహుల్ గాంధీ ఆశలు పెరిగాయి. పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశముందని [more]

Update: 2021-04-21 17:30 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై రాహుల్ గాంధీ ఆశలు పెరిగాయి. పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశముందని ఆయన భావిస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేక దేశవ్యాప్తంగా కన్పిస్తుందని రాహుల్ గాంధీ అంచనాకు వచ్చారు. దీంతో పార్టీని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి రాహుల్ గాంధీ రెడీ అయినట్లు కన్పిస్తుంది. రాష్ట్రాల వారీగా కొత్త నేతలకు బాధ్యతలను అప్పగించాలని ఆయన డిసైడ్ అయ్యారంటున్నారు.

దేశంలో సానుకూల వాతావరణం…..

దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు కొంత సానుకూల పవనాలు వీస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేకపోయినా, ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉందని ప్రజలు గుర్తించారు. ఈ ప్రభావం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కన్పిస్తుందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోనూ సయితం కాంగ్రెస్ కూటమి అనూహ్య రీతిలో ఎక్కువ స్థానాలను దక్కించుకుంటుందని రాహుల్ గాంధీ అంచనాకు వచ్చారు.

మోదీపై వ్యతిరేకత…..

కేరళలోనూ ఎన్నికల ముందు వరకూ ఎల్డీఎఫ్ కు కొంత అనుకూల పరిస్థితులు కన్పించినా ఎన్నికల సమయానికి యూడీఎఫ్ వైపు ప్రజలు మొగ్గు చూపారని తన సన్నిహితుల వద్ద రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తమిళనాడులో ఎటూ డీఎంకే విజయం తధ్యమని భావిస్తున్నారు. అసోంలోనూ కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం ఉందన్న లెక్కలు రాహుల్ గాంధీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

అధ్యక్ష పదవిని…..

ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ ఏఐసీపీ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. నేతలనుంచి వత్తిడి ఎక్కువగా ఉండటం, మరికొద్దిరోజుల్లోనే పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో అధ్యక్ష పదవిని చేపట్టాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా ఉత్తర్ ప్రదేశ్ పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టనున్నారు. మొత్తం మీద మోదీపై వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనపడుతుండటంతో రాహుల్ గాంధీ 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమయిపోతున్నారు.

Tags:    

Similar News