రాహుల్ పట్టు..బెట్టు..వీడనది అందుకేనా?

రాహుల్ గాంధీ ఇక అధ్యక్ష్య బాధ్యతలను చేపట్టడని తేలిపోయింది. ఎవరో ఒకరిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాల్సిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియగాంధీ ఉన్నారు. ఆమె [more]

Update: 2020-08-23 17:30 GMT

రాహుల్ గాంధీ ఇక అధ్యక్ష్య బాధ్యతలను చేపట్టడని తేలిపోయింది. ఎవరో ఒకరిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాల్సిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియగాంధీ ఉన్నారు. ఆమె స్థానంలో రాహుల్ గాంధీ రావాలని కొద్దికాలం నుంచి డిమాండ్ వినపడుతుంది. ముఖ్యంగా సీనియర్ నేతలు సయితం రాహుల్ గాంధీయే తిరిగి పదవి చేపట్టాలని కోరుతున్నారు. కానీ రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. ఆయన పదవిని చేపట్టేందుకు ఇప్పటికీ ఇష్టపడటం లేదట.

గాంధీ కుటుంబం అంటూ…..

ఇందుకు కారణం కూడా ఉందట. బీజేపీ నేతలు పదే పదే గాంధీ కుటుంబం కాంగ్రెస్ ను ఏలుతుందని, కుటుంబ రాజకీయాలంటూ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనుకున్నారట. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. సోనియా గాంధీ నాలుగేళ్ల పాటు అధ్యక్ష బాధ్యతలను చేపట్టలేరు. ఆమె ఆరోగ్యం కూడా ఇందుకు సహకరించదు. దీంతో తనపైనే వత్తిడి పెరుగుతుందని రాహుల్ గాంధీకి తెలయంది కాదు.

బ్యాక్ సీట్ లో ఉన్నా…..

కానీ తాను అధ్యక్ష్య పదవిలో ఉండటం కంటే బ్యాక్ సీట్ లోనే ఉండటం బెటరని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కొత్త అధ్యక్షుడు తీసుకునే ఏ నిర్ణయమైనా సమిష్టిగా తీసుకుంటారు కాబట్టి ఎటువంటి సమస్యలుండవన్నది రాహుల్ గాంధీ అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో పాటు తాను ఫ్రీగా పర్యటించేందుకు కూడా వీలుంటుంది. తనపైన అధికార పార్టీ ఫోకస్ తగ్గుతుంది. అవసరమైతే ఎన్నికల సమయానికి లీడ్ రోల్ పోషించవచ్చన్నది రాహుల్ అభిప్రాయంగా ఉంది.

ప్రియాంక సయితం…..

దీనికి తోడు రాహుల్ గాంధీ సోదరి సయితం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాంధీ కుటుంబీకులు కాకుండా ఎవరైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చని ప్రియాంక ప్రకటన వెనక కూడా రాహుల్ ఉన్నారన్నది స్పష్టమవుతోంది. కాంగ్రెస్ కొత్త పంథాను ఎంచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం కూడా ఇదే కారణమంటున్నారు. దీంతో మరికొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ గాంధీ కుటుంబం నుంచి కాకుండా కొత్త వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నారు.

Tags:    

Similar News