రాహుల్ టెన్షన్ అంతా అదేనట

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒంటరిపోరాటం చేస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలందరినీ ప్రచారానికి దూరం పెట్టడంతో రాహుల్ గాంధీ ఒక్కరే అంతా తానే అయి నడిపిస్తున్నారు. [more]

Update: 2021-04-09 17:30 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒంటరిపోరాటం చేస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలందరినీ ప్రచారానికి దూరం పెట్టడంతో రాహుల్ గాంధీ ఒక్కరే అంతా తానే అయి నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇటు కేరళ, అసోంలపైనే ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు. తమిళనాడులో ఎటూ డీఎంకే కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో మూడింటినైనా చేజిక్కించుకుని కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికల తర్వాత…..

రాహుల్ గాంధీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా కాదు. ఆయన 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ విన్పిస్తున్నా ఆయన అయిష్టంగానే ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏఐసీసీ సమావేశాలు నిర్వహించి దీనిపై రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తుంది. అందుకోసమే ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఆయన విస్తృతంగా పాల్గొంటున్నారు.

సీనియర్ల నోళ్లను…..

సీనియర్ నేతల నోళ్లు మూయించాలంటే కాంగ్రెస్ ఈ ఐదు రాష్ట్రాల్లో తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది. కనీసం మూడు రాష్ట్రాల్లోనైనా ప్రతిభ కనబరిస్తే సీనియర్ నేతలందరూ కట్టడి అవుతారు. దాదాపు 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధిష్టానంపై తరచూ ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. వీరందరినీ పక్కన పెట్టి యువతకు పార్టీలో పదవులు ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ యోచనగా ఉంది.

ప్రక్షాళన దిశగా….

అందుకోసమే రాహుల్ గాంధీ ఈ ఎన్నికల కోసం శ్రమిస్తున్నారు. సక్సెస్ అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని వెంటనే చేపట్టే అవకాశముంది. అలాగే తన టీంకు పదవులు అప్పగించనున్నారు. ఏఐసీీసీ, సీడబ్ల్యూసీ లను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News