రాహుల్ మనసు మారకపోవడానికి అదే కారణమా?

ఇక కాంగ్రెస్ కు ప్రియాంక మాత్రమే దిక్కుగా కన్పిస్తుంది. సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. సమీక్షలు కూడా చేయలేకపోతున్నారు. దీంతో నాయకత్వ [more]

Update: 2020-03-22 17:30 GMT

ఇక కాంగ్రెస్ కు ప్రియాంక మాత్రమే దిక్కుగా కన్పిస్తుంది. సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. సమీక్షలు కూడా చేయలేకపోతున్నారు. దీంతో నాయకత్వ లేమి స్పష్టంగా కన్పిస్తుంది. పార్టీ భవిష్యత్ పైన కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నీరసపడిపోయినట్లు కన్పిస్తున్నాయి. అంతేకాదు పార్టీని నేతలు వదిలిపోతున్నది కూడా నాయకత్వం లేకనేనన్నది స్పష్టంగా తెలుస్తోంది.

అనేక రాష్ట్రాల్లో…..

ఇటీవల మధ్యప్రదేశ్ లో యువనేత సింధియా పార్టీని వీడటం అక్కడి రాజకీయ పరిస్థితులు ఒక కారణం కాగా, నాయకత్వం కూడా మరొక కారణం. అదే రాహుల్ గాంధీ జాతీయ అధ్కక్ష పదవి చేపట్టేందుకు సుముఖత చూపితే జ్యోతిరాదిత్య అంత తొందరపడేవారు కాదన్న వాదన బలంగా ఉంది. రాహుల్ నాయకత్వంలో ఎప్పటికైనా కాంగ్రెస్ పుంజుకోగలదన్న విశ్వాసం ఉండేది. కానీ రాహుల్ గాంధీ తాను పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ససేమిరా అనడంతో సింధియా పార్టీని వీడి వెళ్లిపోయారు.

అందుకే రాహుల్….

గుజరాత్ లోనూ ఇదే పరిస్థితి. హైకమాండ్ వీక్ గా ఉండటంతో అక్కడి ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం కొరవడింది. ఫలితంగా పార్టీ బలహీన పడుతోంది. రాహుల్ గాంధీ ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. మధ్యప్రదేశ్ పరిణామాలకు ముందు రాహుల్ కొంత నెమ్మడించినా, తర్వాత మాత్రం నో చెప్పేశారని తెలుస్తోంది. సీనియర్ నేతల ఆధిపత్యాన్ని కట్టడి చేయలేకనే రాహుల్ కాడి వదేశారంటారు.

ప్రియాంక గాంధీకి….

ఈ నేపథ్యంలో ప్రిియాంక గాంధీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. రాహుల్ మనసు మారే వరకూ ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించాలన్న డిమాండ్ విన్పిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలగా ఉన్న సోనియా గాంధీ యాక్టివ్ గా పాల్గొనలేకపోవడంతో ప్రియాంక గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించాలని పార్టీ హైకమాండ్ కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సోదరుడు రాహుల్ మనసు మారే వరకూ ప్రియాంక పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశముంది.

Tags:    

Similar News