మొ‍హం మొత్తిందా…?

కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఇప్పట్లో తీరాలా లేవు. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ అంశాన్ని తీసుకుని మామూలు మైలేజీ సాధించలేదు. దీంతో కాశ్మీర్ అంశంపై కాంగ్రెస్ పార్టీలోని [more]

Update: 2019-08-10 18:29 GMT

కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఇప్పట్లో తీరాలా లేవు. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ అంశాన్ని తీసుకుని మామూలు మైలేజీ సాధించలేదు. దీంతో కాశ్మీర్ అంశంపై కాంగ్రెస్ పార్టీలోని నేతలే బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సొంత పార్టీపై అసహనం ప్రదర్శిస్తున్నారు. కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న స్టాండ్ ను సొంత పార్టీ నేతలే స్వాగతించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉన్న నేతలు సయితం రాంగ్ డెసిషన్ అంటూ టెన్ జన్ పథ్ వైపు చూపుతున్నారు.

లోక్ సభ ఎన్నికలకు ముందు….

అసలు లోక్ సభ ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పరిస్థితి ఇంత దయనీయంగా లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న నమ్మకం కింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకూ ఉండేది. ముఖ్యంగా పంజాబ్ లో విజయం సాధించడం, గుజరాత్ ఎన్నికల్లో అధికారం దక్కకపోయినా హోరాహోరీ పోరాడటంతో రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పార్టీలోనూ, బయటా రాహుల్ జపం మామూలుగా లేదు.

మూడు రాష్ట్రాల్లో విజయంతో…..

ఆ తర్వాత కొంతకాలం క్రితం జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ , రాజస్థాన్ ఎన్నికల తర్వాత ఇక రాహుల్ గాంధీని పట్టలేకపోయారు. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో లోక్ సభ ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమా కాంగ్రెస్ లో కన్పించింది. మిత్రపక్షాల్లోనూ మోదీని ఓడించగల సత్తా రాహుల్ గాంధీకి ఉందని నమ్మారు. దీంతో మిత్రపక్స పార్టీలన్నీ కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు డిసైడ్ అయిపోయాయి. ఉత్తరప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో పొత్తులతో కాంగ్రెస్ బరిలోకి దిగింది. అయినా ఓటమి తప్పలేదు.

మిత్రపక్షాలు సైడయిపోతూ…..

అయితే తాజాగా రాహుల్ గాంధీ రాజీనామా చేయడం, కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండటంతో మిత్రపక్షాలు కూడా హస్తం పార్టీని దూరం పెట్టేస్తున్నాయి. కీలక బిల్లుల విషయంలో డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ మినహా పెద్దగా ఎవరూ కలసి రావడం లేదు. మాయావతి ఎప్పటి నుంచో కాంగ్రెస్ ను దూరం పెట్టేశారు. మమత బెనర్జీ పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా కలసి రావడం లేదు. ఆర్జేడీ మిత్రపక్షంగా ఉన్నా సైలెంట్ అయిపోయింది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందున్న ఊపు ఇప్పుడు కాంగ్రెస్ లో లేకపోవడంతో మిత్రపక్షాలు కూడా సైడయిపోతున్నాయనే చెప్పాలి.

Tags:    

Similar News