వచ్చే సమయం దగ్గర పడినా రానుంటున్నారే?

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష్య బాధ్యతలను వదిలేసి దాదాపు ఏడాది గడుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. మరోవైపు సోనియా గాంధీ [more]

Update: 2020-06-30 17:30 GMT

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష్య బాధ్యతలను వదిలేసి దాదాపు ఏడాది గడుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. మరోవైపు సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే మోదీని విమర్శించడంలో మాత్రం రాహుల్ ముందుంటున్నారు కాని, పార్టీ పగ్గాలు మాత్రం చేపట్టేందుకు సుముఖంగా లేరు. ఇందుకు కారణం సీనియర్ నేతలే కారణమని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

యువనాయకత్వాన్ని……

ప్రతి పార్టీలో యువనాయకత్వాన్ని కోరుకుంటుంది. వయసు మీరిన నేతలతో ఇప్పటి జనరేషన్ కనెక్ట్ కాలేకపోతోంది. అందుకే యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ లో మాత్రం అది సాధ్యం కావడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లే కోటరీగా మారి పార్టీ అధినాయకత్వాన్ని ప్రభావితం చేస్తున్నారు. వారి చేతుల్లోనే పార్టీ చిక్కుకుపోయి ఉంది. అందుకే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.

సీనియర్ నేతలే…..

ముఖ్యంగా జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటానికి అక్కడి సీనియర్ నేతలే కారణమని చెప్పక తప్పదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల ఎంపికలో రాహుల్ గాంధీ మాట చెల్లుబాటు కాలేదు. అప్పటి నుంచే రాహుల్ గాంధీ సీనియర్ నేతల పట్ల గుర్రుగా ఉన్నారు. గుజరాత్ లో ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నా రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. గుజరాత్ లో గత ఎన్నికల్లో అన్ని సీట్లు రావడానికి రాహుల్ గాంధీ కారణమన్నది అందరికీ తెలిసిందే. గుజరాత్ లో ఇంత జరుగుతున్నా రాహుల్ జోక్యం చేసుకోకపోవడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది.

రానున్న ఎన్నికల్లో…..

రానున్న కాలంలో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ సమాయత్తం కావాల్సి ఉంది. కానీ అక్కడ కూడా యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలని రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. కానీ అక్కడ సీనియర్లు మాత్రం గట్టిగానే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు రెడీ అయిపోతున్నారు. దీంతో రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన ఒక సమావేశంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేయగలగితేనే రాహుల్ గాంధీ తిరిగి పగ్గాలు స్వీకరిస్తారన్న టాక్ కూడా ఉంది. రాహుల్ తొందరపడకపోతే ఆ రాష్ట్రాలు కూడా కనీస పోటీ ఇవ్వలేక పోవడం ఖాయంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News