రాహుల్ అనుమానించింది నిజమేనా?

కాంగ్రెస్ లో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు అసంతృప్తి రాహుల్ గాంధీ ఊహించిందేనంటున్నారు. మోదీ వ్యూహంలో భాగంగా కొందరు అసంతృప్తి గళం విన్పిస్తున్నారని రాహుల్ గాంధీ గతంలో [more]

Update: 2021-03-14 18:29 GMT

కాంగ్రెస్ లో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు అసంతృప్తి రాహుల్ గాంధీ ఊహించిందేనంటున్నారు. మోదీ వ్యూహంలో భాగంగా కొందరు అసంతృప్తి గళం విన్పిస్తున్నారని రాహుల్ గాంధీ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాకు లేఖ రాసిన సమయంలో రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. దీనికి అప్పట్లో అభ్యంతరం తెలిపినా, జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమనిపించక మానదు.

చిన్న కారణాలతో…..

కాంగ్రెస్ కు శాశ్వత అధ్యక్షుడు లేరని, దాని కారణంగా పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతుందన్నది సీనియర్ కాంగ్రెస్ నేతల వాదన. అయితే దీనిపై అసంతృప్తి నేతలతో సోనియా గాంధీ మాట్లాడారు. చల్లబడినట్లే కన్పించిన సీనియర్ నేతలు మళ్లీ దూకుడు పెంచారు. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుండటమే కాకుండా మోదీని ప్రశంసించడం రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నట్లుంది.

సోనియా జమానా వరకూ…..

సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉన్నంత వరకూ సీనియర్ నేతలు ఎవరూ నోరు మెదపలేదు. సోనియాతో తమకున్న రాజకీయ అనుబంధం, ఆమె తమకు ఇచ్చే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సీనియర్లు సంతృప్తిగానే ఉన్నారు. సోనియా తమ మాట వింటుందన్న నమ్మకం కావచ్చు. అయితే రాహుల్ జమానా వచ్చింది. సోనియా టెన్ జన్ పథ్ కే పరిమితమయ్యారు. పదేళ్ల నుంచి కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదంటున్న సీనియర్ నేతలు ఏడేళ్లకు ముందు తాము అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయారు.

తమకు ప్రాధాన్యత లేదనేనా?

రాహుల్ గాంధీ వస్తే తమకు ప్రాధాన్యత తగ్గుతుందని సీనియర్లు ఇప్పుడు ఈ జపం అందుకున్నారని తెలుస్తోంది. తమను పట్టించుకోక పోవడం, తమ సలహాలను, సూచలను తీసుకోకపోవడంతోనే సీినియర్లు రివర్స్ అయ్యారంటున్నారు. రాహుల్ గాంధీ కూడా వీరిని పెద్దగా పట్టించుకోవడంలేదు. 23 మంది అసంతృప్తి నేతలు పెద్దగా జనంలో ఆదరణ కలిగిన నేతలు కాకపోవడంతో కాంగ్రెస్ లైట్ గా తీసుకుంటుంది. వీరి వెనక మోదీ ప్రభావం కూడా ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తానికి రాహుల్ టార్గెట్ గానే సీనియర్ నేతలు ముందుకు వెళుతున్నట్లు కనపడుతుంది.

Tags:    

Similar News