రాహుల్ అనుకున్నట్లుగానే జరుగుతుందా?

ఎంతకాలం చూస్తాడు. పార్టీని భ్రష్టు పట్టిస్తూ, తన తల్లి సోనియా గాంధీని అనేక విషయాల్లో తప్పుదోవ పట్టిస్తున్న సీనియర్ నేతలను రాహుల్ గాంధీ ఒక ఆట ఆడేసుకున్నారు. [more]

Update: 2020-08-24 16:30 GMT

ఎంతకాలం చూస్తాడు. పార్టీని భ్రష్టు పట్టిస్తూ, తన తల్లి సోనియా గాంధీని అనేక విషయాల్లో తప్పుదోవ పట్టిస్తున్న సీనియర్ నేతలను రాహుల్ గాంధీ ఒక ఆట ఆడేసుకున్నారు. ఏకంగా బీజేపీ కార్యకర్తలంటూ కామెంట్స్ చేశారు. నిజానికి రాహుల్ నుంచి సీనియర్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలను ఊహించలేదు. తాము లేఖ రాసినా పార్టీ ప్రయోజనం కోసమే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు సీనియర్లు కానీ రాహుల్ వారి మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. తన తల్లి అనారోగ్యంతో ఉండగా ఇలాంటి లేఖలు రాయడమేంటని ప్రశ్నించారు. ఈ లేఖ బయటకు ఎలా లీక్ అయిందని కూడా నిలదీశారు.

సీనియర్ల తో చాలా కాలంగా….

నిజానికి సీనియర్ నేతల తీరుతో రాహుల్ గాంధీ చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిణామాలు కూడా రాహుల్ గాంధీకి సీనియర్లపై ఏవగింపు కలిగేలా చేశాయి. ఇంకా సీనీయర్ నేతలు రాహుల్ గాంధీని తల్లి చాటు బిడ్డగా చూస్తున్నారు. ప్రధాన విషయాలన్నీ సోనియాకు చెప్పడం, ఆమెను కన్విన్స్ చేయడంతో అనేక సమస్యలు వస్తున్నాయని రాహుల్ గాంధీ గ్రహించారు.

సోనియాను తప్పుదోవ పట్టిస్తూ….

మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రుల ఎంపికలోనూ సోనియాను సీనియర్లు తప్పుదోవ పట్టించారని రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. తనకు ఇష్టమైన ఇద్దరు యువనేతలు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ లు సీనియర్ల తో పడిన ఇబ్బందులు కూడా ఆయన గుర్తుకు తెచ్చుకున్నట్లు కనపడుతుంది. అందుకే రాహుల్ గాంధీ సీనియర్లని చూడకుండా కూడా కఠినంగానే వ్యాఖ్యారించారంటున్నారు.

ప్రజల్లోనుంచి వచ్చిన వారు కారు…..

ఇక పార్టీలో సీనియర్లు అందరూ నేరుగా ప్రజల్లో నుంచి వచ్చిన వారు కారు. వారంతా రాజ్యసభకు ఎంపికవుతున్న వారే. కేంద్ర మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులను వారు సోనియా ఆశీస్సులతోనే ఇన్నాళ్లూ చేపట్టారు. సమయం, సందర్భం లేకుండా లేఖ రాయడం రాహుల్ కు మరింత ఆగ్రహం తెప్పించిందంటున్నారు. చాలా రోజుల నుంచి సీనియర్లను దూరంగా పెట్టాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కానీ సమయం రాలేదు. ఇప్పుడు లేఖ రూపంలో ఆయనకు అవకాశం చిక్కిందంటున్నారు. అందుకే రాహుల్ బరస్ట్ అయ్యారంటున్నారు.

Tags:    

Similar News