రాజుగారికి అందుకే రుచించడం లేదట

వైసీపీతో బీజేపీ అంటకాగుతుండటం ఇటు టీడీపీకే కాదు మరికొందరికి కూడా మింగుడు పడటం లేదు. అందులో ముఖ్యంగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు అసలు గిట్టడం [more]

Update: 2020-10-08 13:30 GMT

వైసీపీతో బీజేపీ అంటకాగుతుండటం ఇటు టీడీపీకే కాదు మరికొందరికి కూడా మింగుడు పడటం లేదు. అందులో ముఖ్యంగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు అసలు గిట్టడం లేదు. జగన్ ఢిల్లీ పర్యటన రఘురామ కృష్ణంరాజు అసలు రుచించడం లేదు. తానేమో సాధారణ పార్లమెంటు సభ్యుడు. జగన్ ముఖ్యమంత్రి. అయినా జగన్ మోదీని కలవడాన్ని రఘురామ కృష్ణంరాజు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రతి అంశంపైనా…..

గత కొంతకాలంగా వైసీపీ, బీజేపీలు కలసి పనిచేస్తున్నాయనే చెప్పాలి. బీజేపీ పార్లమెంటు ఉభయ సభల్లో పెట్టే ప్రతి అంశాన్ని వైసీపీ సమర్థిస్తూ వస్తుంది. ఎన్డీఏ మిత్రపక్షమై, కేంద్ర మంత్రివర్గంలో ఉన్న అకాలీదళ్ సయితం వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ మొన్న పక్కకు తప్పుకుంది. అయినా వైసీపీ మాత్రం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి అంశాన్ని పాజిటివ్ గా తీసుకుంటుంది. దీంతో ఎన్డీఏలో లేకపోయినా పరోక్షంగా బీజేపీ వైసీపీని మిత్రపక్షంగానే చూస్తుంది.

అంతా అబద్ధమేనట…..

అందుకే నేరుగా వైసీపీని కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవాలని ఆలోచించింది. కానీ రఘురామ కృష్ణంరాజు మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తన అక్కసునంతా వెళ్లగక్కుతున్నారు. ఏపీలో ఆలయాలను కూలగొట్టే వైసీపీని దేవాలయాలను నిర్మించే బీజేపీ ఎందుకు చేర్చుకుంటుందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇది ప్రచారంగానే రఘురామ కృష్ణంరాజు కొట్టి పారేస్తున్నారు. బయట జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమేనని రఘురామ కృష్ణంరాజు వాదన.

తాను చేరాలనుకుంటున్న పార్టీలో…..

రఘురామ కృష్ణంరాజుకు అసలు కోపానికి వేరే కారణం ఉందంటున్నారు. ఇటీవల జగన్ అమిత్ షా ను కలసినప్పుడు రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటీషన్ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తనను వదలిపెట్టకుండా వెంటపడుతుండటంపై రాజుగారు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా తాను చేరాలనుకుంటున్న బీజేపీతో వైసీపీ సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేయడం కూడా రఘురామ కృష్ణంరాజు కు రుచించడం లేదు.

Tags:    

Similar News