జగన్ కు టెంపరేచర్ పెంచుతున్నారా?

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన రూటే సెపరేట్ అంటున్నారు. నర్సాపురం నుంచి ఎంపీగా నెగ్గిన ఆరు నెలల వ్యవధిలోనే వైసీపీ నుంచి వేరు పడిపోవాలనుకుంటున్నారు. దానికి [more]

Update: 2019-12-29 12:30 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన రూటే సెపరేట్ అంటున్నారు. నర్సాపురం నుంచి ఎంపీగా నెగ్గిన ఆరు నెలల వ్యవధిలోనే వైసీపీ నుంచి వేరు పడిపోవాలనుకుంటున్నారు. దానికి జాగ్రత్తగా ఆయన ఒక వైపు నుంచి నరుక్కు వస్తున్నారు. పార్టీ లైన్ ని ధిక్కరించడం ద్వారా తనను పార్టీయే బయటకు పంపాలని రఘురామ కృష్ణంరాజు గారు స్కెచ్ వేస్తున్నాట్లుగా తెలుస్తోంది. జగన్ కి కోపం తెప్పిస్తే బహిష్కరణ వేటు వేస్తారు. దాంతో హ్యాపీగా నచ్చిన బీజేపీలో పదవితో పాటుగా చేరిపోవచ్చునన్నది రఘురామ కృష్ణంరాజు గారి ఆలోచనగా ఉందని అంటున్నారు.

బాబుకు అనుకూలంగా….

చంద్రబాబు అంటే జగన్ కి మంట అన్నది తెలిసిందే. వైసీపీలో ఉన్న వారికి ఆ సంగతి ఇంకా బాగా తెలుసు. పైగా బాబు జగన్ కి రాజకీయ ప్రత్యర్ధి. అటువంటి బాబుకి అనుకూలంగా ఎంపీ స్థాయి వ్యక్తి కామెంట్స్ చేస్తే ఏమైనా ఉందా. కానీ రఘురామ కృష్ణంరాజు అదే చేస్తున్నారు. బాబుని ఇరికించడం వైసీపీ వశం కాదని ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతిలో బినామీలు భూములు కొంటే బాబుని ఎలా కార్నర్ చేస్తారు. చట్ట ప్రకారం అది కుదిరే పని కాదని తనదైన శైలిలో తీర్పు చెప్పేస్తున్నారు. మొత్తానికి జగన్ కి ఎక్కడ కాలాలో అన్నట్లుగా హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

రైతుల ధర్నాపై….

అమరావతి రైతులు ఆందోళన చేస్తున్న సంగతి విdrతమే. వారు రాజధాని ఇక్కడే ఉంచాలని పట్టుపడుతున్నారు. దాని మీద కూడా రఘురామ కృష్ణంరాజు గట్టిగానే వైసీపీ సర్కార్ని డిమాండ్ చేస్తున్నారు. ముందు రైతుల సమస్యలు పరిష్కరించి ఆ మీదట రాజధాని తరలింపు ఉండాలని అచ్చం టీడీపీ గొంతుకతో అంటున్నారు. వారు పెయిడ్ ఆర్టిస్టులు కారు, వారిది న్యాయమైన డిమాండ్ అని వెనకేసుకువస్తున్నారు. ఇన్ డైరెక్ట్ గా జగన్ విధానాలను తప్పుపడుతున్నారు.

అక్కడే ఉంచాలట….

ఇక మూడు రాజధానుల ముచ్చట పైనా కూడా రఘురామ కృష్ణంరాజు సొంత అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అమరావతి అందరికీ సెంటర్ పాయింట్ అని. అందువల్ల అక్కడే అన్నీ ఉండడం మంచి విధానం అని కూడా అంటున్నారు. వికేంద్రీకరణ వల్ల పాలన కుంటుపడుతుందని కూడా అచ్చం టీడీపీ భాషనే వాడుతున్నారు. మొత్తానికి రఘురామ కృష్ణంరాజు మాత్రం జగన్ కి తపోభంగం కలిగించాలనుకుంటున్నారు. ఆయన‌ మూడవ కన్ను తెరచి శపిస్తే తనకు అదే పదివేలు అనుకుంటున్నారు. ఎంచక్కా బీజేపీలోకి చేరిపోవచ్చు అని కూడా ఆలోచనలు చేస్తున్నారు మరి జగన్ ఇంతవరకూ భరించారు. మరెంతవరకూ భరిస్తారో. జగన్ కి టెంపరేచర్ పెంచడమే టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్న రఘురామ కృష్ణంరాజు ఎంపీగా బయటకు వెళ్ళిపోగలరా. లేక జగన్ ఆయన్ని కట్టడి చేసే వ్యూహాలు రచిస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News