రాజు గారి ఫైలు దులుపుతున్నారా?

పార్లమెంటు సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు పడుతుందా? [more]

Update: 2020-09-11 12:30 GMT

పార్లమెంటు సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు పడుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రఘురామ కృష్ణంరాజు పార్టీ లైను దాటి గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్నారు. ఆయనపై ఇప్పటికే వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అనర్హత పిటీషన్ స్పీకర్ వద్ద ఉంది.

ఈ పార్లమెంటు సమావేశాలలో…..

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటీషన్ పై వైసీపీ మరోసారి స్పీకర్ దృష్టికి తేనుంది. త్వరలో జరగనున్న వైసీపీ పార్లమెంటు కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చించనున్నారు. ఇటీవల కాలంలో రఘురామ కృష్ణంరాజు వరసగా ప్రతి రోజు రచ్చబండ పేరుతో ఢిల్లీలో మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. విధానాలను విమర్శిస్తున్నారు.

విమర్శలు ప్రతి రోజూ….

అమరావతి రైతుల దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వరకూ రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వ విధానాలను తప్పపట్టారు. జగన్ ప్రభుత్వం అనేక అంశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని కూడా రఘురామ కృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేశారు. జగన్ పై నేరుగా విమర్శలు చేయకున్నా, ఆయన సలహాదారులపై రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు.

వత్తిడి తేనున్న వైసీపీ…..

దీన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానుండటంతో రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాల్సిందేనని వైసీపీ పట్టుబట్టనుంది. మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలవాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించుకున్నారు. రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటీషన్ పై ఈ సమావేశాల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకునేలా వత్తిడి తేవాలన్నది వైసీపీ ఆలోచనగా ఉంది. రాజ్యసభలోనూ పలు కీలక బిల్లులకు వైసీపీ మద్దతు కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉంది. అయితే లో క్ సభ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటీషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News