ఆయన ధైర్యం అదేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలంగా ఉంది. జగన్ కూడా బలం పెంచుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. [more]

Update: 2019-12-01 08:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలంగా ఉంది. జగన్ కూడా బలం పెంచుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. బీజేపీ బలోపేతం అవ్వాలని ప్రయత్నిస్తున్నా అది ఏపీలో సాధ్యమవ్వడం అంత సులువు కాదు. ఇన్నీ తెలిసి ఆ ఎంపీ ధైర్యం ఏంటన్న ప్రశ్న పార్టీలో తలెత్తుతోంది. నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు పార్టీ లైన్ ను పదే పదే థిక్కరిస్తుండటానికి కారణమేంటన్న చర్చ జరుగుతోంది.

టీడీపీ లో చేరి..వెంటనే….

నిజానికి రఘురామ కృష్ణంరాజు 2019 ఎన్నికలకు ముందు తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన చేరి పొగడ్తలో ముంచెత్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో కటీఫ్ చేసుకోవడంతో మనసు మార్చుకున్న రఘురామ కృష్ణంరాజు వైసీపీలోకి జంప్ చేశారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన జనసేన అభ్యర్థి నాగబాబు చేతిలో కేవలం 26 వేల మెజారిటీతోనే గెలవడం గమనార్హం.

వ్యాపారాలు… కేసులు….

రఘురామ కృష్ణంరాజుపైన కూడా బ్యాంకు రుణాలు ఎగవేసిన కేసులు ఉన్నాయి. ఆయనకు ఉత్తరాఖండ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలలో వ్యాపారాలున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఆయన కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీతో కొంత సఖ్యతగానే ఉండాల్సి ఉంది. అలాగే ఢిల్లీలో రఘురామకృష్ఱంరాజు లాబీయింగ్ కూడా వెరైటీగా ఉంటుందంటున్నారు. కేంద్రమంత్రులు, అధికార పార్టీలో ఉన్న ఎంపీల బర్త్ డే లకు అస్సలు మిస్ కారట. ఒకవేళ అందుబాటులో లేకుండా గిఫ్ట్ ప్యాక్ పంపుతారన్న ప్రచారం ఉంది. అలా అధికార పార్టీ నేతలతో రఘురామ కృష్ణంరాజు అంటకాగుతూనే ఉంటారు.

కేవీపీ వియ్యంకుడు కావడంతో…..

ఇటీవల జగన్ పిలిచి వార్నింగ్ ఇచ్చినా ఆయనలో మార్పు రాలేదంటున్నారు. అయితే జగన్ రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోక పోవడానికి కూడా మరొక బలమైన కారణ ముందం టున్నారు. రఘురామ కృష్ణంరాజు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావుకు స్వయానా వియ్యంకుడు. దీంతో పాటు ఆయన లాబీయింగ్ చేయడం ఈనాటిది కాదని జగన్ కు తెలియంది కాదు. రఘురామ కృష్ణంరాజు కూడా వైసీపీ వీడి వెళ్లే సాహసం చేయరు. అందుకే జగన్ ఆయనకు వార్నింగ్ లతోనే సరిపెడుతున్నారన్నది పార్టీలో నడుస్తున్న టాక్.

Tags:    

Similar News