నర్సాపురం ఉప ఎన్నిక గ్యారంటీ… జెయింట కిల్లర్ అవుతారా?

ఎన్నికలు అంటే ఇప్పట్లో లేవని బాధపడే వారికి ఒక శుభ వార్తే అనుకోవాలి. నిజానికి అన్ని సవ్యంగా ఉంటే ఈ పాటికి స్థానిక ఎన్నికలు జరగాలి. కానీ [more]

Update: 2020-07-02 14:30 GMT

ఎన్నికలు అంటే ఇప్పట్లో లేవని బాధపడే వారికి ఒక శుభ వార్తే అనుకోవాలి. నిజానికి అన్ని సవ్యంగా ఉంటే ఈ పాటికి స్థానిక ఎన్నికలు జరగాలి. కానీ అలా సీన్ లేదు. కరోనా వల్ల ఎన్నిక వాయిదా పడింది. ఎపుడు జరుగుతుందో తెలియదు. ఇక ఏపీలో ఏ ఉప ఎన్నికా లేదు అనుకుంటున్న తరుణంలో నర్సాపురం కళ్ల ముందు కనిపిస్తోంది. ఎంపీగా ఎన్నికై ఏడాది మాత్రమే అయినా కూడా వైసీపీ హైకమాండ్ తో సున్నం పెట్టుకున్న రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు కత్తి వేలాడుతోంది. జగన్ ని ధిక్కరించిన ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా ఉండనీయరాదు అని వైసీపీ గట్టిగా భావిస్తోంది. ఈ విషయంలో జగన్ వ్యక్తిగతంగా తీసుకుని మరీ పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు. సాధారణంగా తమ పార్టీని ధిక్కరించిన వారి మీద ఆ పార్టీ స్పీకర్ కి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారు. అయితే స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి లేదు. కానీ ఇక్కడ వైసీపీ గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది.

వేటు ఖాయమే …..

పైగా ఏపీలో వైసీపీ పవర్ లో ఉంది. ఇక లోక్ సభలో నాలుగవ అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉంది. రాజ్యసభలో ఆరుగురు ఎంపీలతో ఆరవ పెద్ద పార్టీగా ఉంది. దీంతో పాటు బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. దాంతో వైసీపీ మద్దతు అవసరం అంటున్నారు. ఒక ఎంపీ కోసం బీజేపీ వైసీపీ లాంటి పార్టీని వదులుకుంటుందని ఎవరూ అనుకోరు. దాంతో స్పీకర్ వైసీపీకి వత్తిడి చేస్తే కచ్చితంగా రాజుగారి మీద వేటు వేయడం ఖాయం. అదే కనుక జరిగితే నర్సాపురం ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇక వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష‌్ణంరాజు చూపు బీజేపీ మీద ఉందని అందరూ అంటున్నారు.

బీజేపీ దిక్కుగా ….

అదే విధంగా రఘురామకృష‌్ణంరాజును వైసీపీ బహిష్కరిస్తే హ్యాపీగా బీజేపీలో చేరి అక్కడ ఎంపీగా కొనసాగాలనుకుంటున్నారు. కానీ వైసీపీ ఆ అవకాశం ఇవ్వదు. ఆయన మీద అనర్హత వేటుకే స్పీకర్ వద్ద పట్టుబడుతుంది. అదే జరిగితే ఉప ఎన్నిక కనుక వస్తే బీజేపీ టికెట్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి కూడా రఘురామకృష‌్ణంరాజు రంగం సిధ్ధం చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు జనసేన మద్దతు కూడా ఉంటుంది, టీడీపీకి నర్సాపురంలో బలం ఉంది, ఆ పార్టీ సైలెంట్ గా మద్దతు ఇచ్చినా కూడా తన విజయం తధ్యమని రఘురామకృష‌్ణంరాజు లెక్కలు వేసుకుంటున్నారుట.

మొనగాడు అవుతారా…?

అలా ఏపీలో జరిగే ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచి జగన్ ని ఎదిరించిన మొనగాడిగా నిలవాలని, రాబోయేకాలానికి ఏపీ బీజేపీలో కీలక నేతగా ఎదిగి వీలుంటే ఏపీ ప్రెసిడెంట్ కూడా కావాలని రఘురామకృష‌్ణంరాజు పెద్ద స్కెచ్ గీశారని చెబుతున్నారు. మొత్తానికి జగన్ ని ఎదిరించడం అన్నది మామూలు విషయం కాదు, ఇపుడు ఆయనని ఎదిరించి రఘురామకృష‌్ణంరాజు ఎంపీ సీటు నిలబెట్టుకున్నా, లేక బీజేపీలో చేరి పోటీ చేసి గెలిచినా జెయింట్ కిల్లర్ గా నిలుస్తారు అంటున్నారు. చూడాలి మరి ఈ రాజకీయం ఎందాకా పోతుందో.

Tags:    

Similar News