జగన్ ముందరకాళ్ళకు బంధమా ?

వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. పొగుడుతూనే తిడుతున్నారు. తిడుతూనే పొగుడుతున్నారు. జగన్ ని దేశంలో నంబర్ వన్ సీఎం కావాలని కోరుతున్న [more]

Update: 2020-06-30 12:30 GMT

వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. పొగుడుతూనే తిడుతున్నారు. తిడుతూనే పొగుడుతున్నారు. జగన్ ని దేశంలో నంబర్ వన్ సీఎం కావాలని కోరుతున్న నోటితోనే ఆయన ప్రభుత్వ విధానాలను విపక్షంతో సమానంగా విమర్శిస్తున్నారు. జగనంటే గౌరవం ఉందంటూనే ఆయన పార్టీ పేరునే తప్పుపడుతున్నారు. కొత్త చిచ్చు పెడుతున్నారు. తాను వైసీపీని వీడనంటూనే నరేంద్రమోడీని పొగుడుతూ వీడియో సాంగ్ వదులుతున్నారు. తనకు జగన్ అవకాశం ఇవ్వలేదని అంటూ ఓ వైపు విమర్శితూనే మా జగన్ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. మొత్తానికి రఘురామ కృష్ణంరాజు పోకడలు అన్నీ తేడాగా కనిపిస్తున్నా మా చెడ్డ తెలివితోనే వైసీపీ హై కమాండ్ తో పేచీ కానీ పేచీకి దిగుతున్నారు.

చర్చ జరగాలనేనా …..?

నిజానికి తిరుపతి దేవుడు భూములు వేలం విషయంలో విపక్షం గట్టిగా తగులుకుంది. అయితే అది టీడీపీ హయాంలోనే తీర్మానం చేశారని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. కానీ జనంలో శ్రీవారి మీద అపారమైన ఆస్తికభావం ఉండడం, పైగా జగన్ వచ్చాక క్రిస్టియన్ రాజ్యం వస్తుందని టీడీపీ ప్రచారం చేయడం దానికి తగినట్లుగానే జరగడంతో ఆస్తిక జనుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని సాకుగా ఇపుడు రఘురామ కృష్ణంరాజు చూపుతూ తాను తిరుపతి దేవుడి భూములు అమ్మడాన్ని మాత్రమే తప్పుపట్టానని అమాయకంగా చెబుతున్నారు.

ఇంగ్లీష్ మీడియంతో….

ఇక ఇంగ్లీష్ మీడియం విషయంలో కూడా చేయాల్సిన రచ్చ అంతా టీడీపీ చేసింది. అసెంబ్లీలో మేము వ్యతిరేకం కాదు అంటూనే బయట మాత్రం తమ వారి చేత కోర్టుల్లో కేసులు వేయించించి అడ్డుకుంది.ఇక దీని మీద కూడా జనాల్లో భినాభిప్రాయాలు ఉన్నాయి. ఇదే అంశం తీసుకుని రఘురామ కృష్ణంరాజు తాను కూడా తెలుగు మీడియాన్ని రద్దు చేయవద్దు అంటున్నానని చెప్పుకున్నారు. ఇక వైసీపీ ఇసుక పాలసీ కూడా జనంలో వ్యతిరేకత ఉన్నదే. దాని వైసీపీ నేత అయి కూడా రాజు గారు ఎత్తి చూపుతున్నారు. ఇళ్ళ పట్టాల విషయంలో ఎమ్మెల్యేల చేతివాటం ఉంది. అది అందరూ కాదు, కానీ దాన్ని హైలెట్ చేస్తూ రఘురామ కృష్ణంరాజు ఇది అవినీతి సర్కార్ అని కలరింగ్ ఇచ్చేశారు. అయితే ఇన్ని చేస్తూ లాజిక్ మిస్ కాకుండా రాసిన లేఖలో మాత్రం జగనే అన్ని రకాలుగా విజయాలు సాధించాలని కోరుకున్నారు.

ఇరకాటమే…..

ఇపుడు రాజుగారి లేఖ తరువాత జగన్ యాక్షన్ కి దిగితే ఎంపీగారికే సానుభూతి వస్తుంది. అలా కాకుండా పిలిచి మాట్లాడితే రఘురామ కృష్ణంరాజు దెబ్బకు జ‌డిసి జగన్ మాట్లాడాలని అంటారు. మరో వైపు పార్టీ పేరుని, పధ‌కాలు, విధానాలు విమర్శించిన వ్యక్తితో భేటీలు వేస్ పార్టీలో మిగిలిన నాయకులు కూడా తోకాడిస్తారు. క్రమశిక్షణ దెబ్బ తింటుంది. మొత్తానికి చూస్తే జగన్ కి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు రఘురామ కృష్ణంరాజు. అంతే కాదు తనకు బీజేపీ పెద్దల మద్దతు ఉందంటూ మోడీ సాంగ్ రిలీజ్ చేసి మరీ బ్లాక్ మెయిల్ కి దిగుతున్నారు. మొత్తానికి వైసీపీలో రఘురామ కృష్ణంరాజు రగడం టీ కప్పులో తుఫాన్ మాత్రం కాదు, రాబోయే సునామీకి గట్టి హెచ్చరికలా ఉంది అని వైసీపీలో అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News