Raghu : ఎవరూ ఇలా లేరే.. ఈ ఒక్కడే ఎందుకిలా?

రఘురామ కృష్ణరాజుకు తన సొంత నియోజకవర్గంలో వ్యతరేకత తీవ్రంగా కన్పిస్తుంది. అధికార పార్టీలో ఉండి ఆ పార్టీపై తిరుగుబాటు చేయడం సొంత సామాజికవర్గం నేతలకే నచ్చడం లేదు. [more]

Update: 2021-11-01 13:30 GMT

రఘురామ కృష్ణరాజుకు తన సొంత నియోజకవర్గంలో వ్యతరేకత తీవ్రంగా కన్పిస్తుంది. అధికార పార్టీలో ఉండి ఆ పార్టీపై తిరుగుబాటు చేయడం సొంత సామాజికవర్గం నేతలకే నచ్చడం లేదు. గతంలో ఎవరూ వ్యవహరించని తీరులో రఘురామ కృష్ణరాజు వ్యవహరిస్తుండటాన్ని తప్పుపడుతున్నారు. క్షత్రియ సామాజికవర్గం పరువు తీస్తున్నారంటున్నారు. సమస్యను మరింత సాగదీస్తూ తనకు తానే నష్టం చేసుకుంటున్నారన్న కామెంట్స్ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి.

అనేక మంది….

నరసాపురం పార్లమెంటు స్థానానికి ఇప్పటికే అనేక పార్టీల నుంచి అనేక మంది ప్రాతినిధ్యం వహించారు. ఎక్కువగా క్షత్రియ సామాజికవర్గం వారే ఎంపీలుగా పనిచేశారు. వీరిలో ఎవరూ ఇలా వీధిన పడింది లేదు. పైగా పార్టీ అగ్రనేతల మన్ననలను పొంది మంచి పదవులను దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ రఘురామ కృష్ణరాజు మాత్రం ఎవరి మాయలో పడి సమస్యను మరింత జటిలం చేసుకుంటున్నారంటున్నారు.

వివాదాలకు దూరంగా….

కనుమూరి బాపిరాజు ఇక్కడి నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారితో సన్నిహిత సంబంధాలు నెరిపారు. అరుదుగా దక్కే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవిని పొందగలిగారు. ఇక్కడి నుంచి భూపిరాజు విజయ్ కుమార్ రాజు మూడుసార్లు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. కానీ ఆయన ఎలాంటి వివాదాల జోలికి పోలేదు. గోకరాజు గంగరాజు కూడా బీజేపీ ఎంపీగా పనిచేసి మన్ననలను అందుకున్నారు.

గెలిచిన రోజు నుంచే….

కానీ రఘురామ కృష్ణరాజు మాత్రం గెలిచిన మరుసటి రోజు నుంచే వివాదాలకు కేంద్రంగా మారారు. ముఖ్యమంత్రి జగన్ తో వ్యక్తిగత వైరాన్ని పెంచుకున్నారు. సహజంగా క్షత్రియులంటే హుందాగా వ్యవహరిస్తారు. కానీ రఘురామ కృష్ణరాజు మాత్రం రోజూ మీడియా సమావేశాలు పెట్టి చిల్లర గా మారారన్న వ్యాఖ్యలు ఆ సామాజికవర్గం నుంచే వినిపిస్తున్నాయి. మొత్తం మీద రఘురామ కృష్ణరాజును ఇటు వైసీపీ, అటు సొంత సామాజికవర్గం లైట్ గా తీసుకుంది. ఇప్పుడు ఆయన గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. తొలినాళ్లలో ఆయనకు ప్రయారిటీ ఇచ్చిన టీడీపీ అనుకూల మీడియా కూడా ఇప్పుడు వదిలేసింది.

Tags:    

Similar News