రాజు గారి ధైర్యం అదేనటగా?

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. అధికార పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్లేందుకే డిసైడ్ అయినట్లు కన్పిస్తుంది. రఘురామకృష్ణంరాజు ధైర్యం ఏమిటన్నదే ఇప్పుడు [more]

Update: 2020-06-26 05:00 GMT

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. అధికార పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్లేందుకే డిసైడ్ అయినట్లు కన్పిస్తుంది. రఘురామకృష్ణంరాజు ధైర్యం ఏమిటన్నదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే అందుకు ఆయన గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీగా గెలవగలననే ధీమాతోనే బలంగా ఉన్న వైసీపీ అధిష్టానానికి ఎదురు తిరిగారంటున్నారు. అవినీతి, ప్రజాసమస్యలు అవన్నీ వట్టి ట్రాష్. రఘురామకృష్ణంరాజు భవిష్యత్ రాజకీయాల కోసమే వైసీపీతో కాలు దువ్వుతున్నారన్నది వాస్తవం.

పంటికింద రాయిలా…..

గత కొద్ది రోజులుగా రఘురామకృష్ణంరాజు వైసీపీ అధిష్టానానికి పంటికింద రాయిలా మారారు. ఆయన చేస్తున్న విమర్శలు పార్టీని ఇబ్బంది పెడుతున్నా కొంత సంయమనం పాటిచారు. చివరకు రోజురోజుకూ శృతి మించుతుండటంతో రఘురామకృష్ణంరాజుకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ఆయన యారగెంట్ గా సమాధానమిచ్చారు. వైసీపీ అస్తిత్వాన్నే ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి ఆయన పార్టీ నుంచి వైదొలగాలనే నిర్ణయించుకున్నారు. తాను క్రమశిక్షణ గల పార్టీ సైనికుడిని చెబుతూనే గోదావరి జిల్లా సెటైర్ లు వేశారు.

కొత్తేమీ కాదు…..

రఘురామ కృష్ణంరాజు పార్టీలు మారడం కొత్త కాదు. ఆయన జగన్ పార్టీ పెట్టగానే వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014లో వైసీపీ నుంచి టిక్కె్ట దక్కకపోవడంతో ఆయన నామినేషన్ వేసి తర్వాత విత్ డ్రా చేసుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత రఘురామకృష్ణంరాజు బీజేపీలో జాయిన్ అయ్యారు. తర్వాత టీడీపీ, బీజేపీకి చెడటంతో అక్కడ బీజేపీ అభ్యర్థిగా గెలవలేమని భావించిన రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరారు. చివరకు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టిక్కెట్ దక్కించుకుని నర్సాపురం పార్లమెంటు నుంచి ఎన్నికయ్యారు.

బీజేపీ, జనసేన ఈక్వేషన్లతోనే….

అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అప్పటి నుంచే రఘురామకృష్ణంరాజు వాయిస్ మారింది. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తాయి. అంటే నర్సాపురం పార్లమెంటు స్థానం ఖచ్చితంగా బీజేపీకే దక్కుతుంది. 2019 ఎన్నికల్లో నరసాపురం, తాడేపల్లి గూడెం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో ఐదు వేల ఓట్లతోనే వైసీపీ అభ్యర్ధుల చేతిలో ఓటమి పాలయ్యారు. జనసేన కలిస్తే బీజేపీ విజయం ఖాయమని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు. నర్సాపురం నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీ చేశారు కాబట్టి ఆయన సీటు కోసం పట్టుబట్టే అవకాశం లేదని భావిస్తున్నారు. బీజేపీలోకి వెళితే సీటు గ్యారంటీ, గెలవడం ఖాయమని భావించే రఘురామకృష్ణంరాజు వైసీపీ అధిష్టానాన్ని ఖాతరు చేయడం లేదంటున్నారు. మొత్తం రఘురామకృష్ణంరాజు వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనన్న ధీమాతోనే కయ్యానికి దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News