రాజు గారు బయటపడి పోయినట్లేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే ఏడాదిలోనే ఒక పార్లమెంటు సభ్యుడికి షోకాజ్ నోటీసు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సహజంగా ప్రాంతీయ పార్టీల్లో [more]

Update: 2020-06-28 00:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే ఏడాదిలోనే ఒక పార్లమెంటు సభ్యుడికి షోకాజ్ నోటీసు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సహజంగా ప్రాంతీయ పార్టీల్లో అధినేతదే ఫైనల్ డెసిషన్. ప్రభుత్వ నిర్ణయాలు, పాలసీలు అధినేత అనుకున్నట్లుగానే జరిగిపోతుంటాయి. జాతీయ పార్టీల మాదిరిగా అంతర్గత ప్రజాస్వామ్య ఉండదు. అధినేత మనసును బట్టి నేతలందరూ నడుచుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే తిరిగి గెలిపించుకునేది ఆయనే కాబట్టి.

తొందరపడి అనేసి….

కానీ రఘురామ కృష‌్ణంరాజు తొందరపడ్డారు. జగన్ తాను ఏమీ అనలేదని అంటూనే తాను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని చెప్పారు. తన వల్లనే పార్లమెంటు నియోజకవర్గంలో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పారు. ఇది అధినేత జగన్ ను ఖచ్చితంగా హర్ట్ చేస్తుంది. ఎందుకంటే దాదాపు ఏడాది పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి వైసీపీ ని అధికారంలోకి తీసుకు వచ్చింది జగన్ మాత్రమే నన్నది అందరికీ తెలిసిందే.

భ్రమలో ఉండిపోయి…..

కొన్ని చోట్ల నేతల ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు. కానీ జగన్ ప్రభావం లేనిదే గత ఎన్నికలలో గెలవలేమన్నది ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ అంగీకరించాల్సిన విషయం. ఇందులో ప్రధానంగా 22 మంది ఎంపీలు గెలవడం వెనక కూడా జగన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ తొలిసారి ఎంపీగా గెలిచిన రఘురామకృష‌్ణంరాజు ఈ గెలుపు తన ఫొటోతోనేని భ్రమలో ఉన్నారు. అందుకే ఆయన జగన్ ప్రభావం తన గెలుపుపై ఎంతమాత్రం లేదని చెప్పే ప్రయత్నం చేశారు.

సమాధానం ఎలా ఉంటుందో?

అయితే రఘురామ కృష‌్ణంరాజు మాత్రం తాను జగన్ ను కాని, ప్రభుత్వాన్ని కాని విమర్శించలేదని చెబుతున్నారు. తాను కొన్ని విషయాల్లోనే విభేదించానని, తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వల్లనే మీడియా ముందు మాట్లాడాల్సి వచ్చిందన్నది రఘురామకృష్ణంరాజు వాదన. షోకాజ్ నోటీసుకు కూడా ఇదే సమాధానం చెప్పనున్నారు. తాను పార్టీకి విధేయుడననే రఘురామ కృష‌్ణంరాజు అంటున్నారు. మొత్తం మీద వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి షోకాజ్ నోటీసు అందుకున్న రఘురామ కృష‌్ణంరాజు సమాధానం ఎలా ఉంటుందో చూడాలి. ఆయన పార్టీ మారేందుకుమార్గం సుగమమయిందనే చెప్పాలి.

Tags:    

Similar News