కత్తెర ఇక్కడ వేశారటగా..?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దూకుడుకు వైసీపీ అధిష్టానం పగ్గాలు వేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా రఘు రామ కృష్ణంరాజు పార్టీ లైన్ థిక్కరిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అంశంలోనూ [more]

Update: 2020-02-01 15:30 GMT

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దూకుడుకు వైసీపీ అధిష్టానం పగ్గాలు వేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా రఘు రామ కృష్ణంరాజు పార్టీ లైన్ థిక్కరిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అంశంలోనూ ఆయన జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడి వార్తల్లోకి ఎక్కారు. దీంతో జగన్ స్యయంగా రఘురామకృష్ణంరాజును పిలపించుకుని క్లాస్ పీకారు. అయినా రాజుగారి మార్పు రాలేదు. ఢిల్లీ స్థాయిలో పార్టీ చెప్పిన దానికి భిన్నంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తన్నారు. దీంతో వైసీపీ అధిష్టానం రాజుగారికి కళ్లెం వేయాలని నిర్ణయించింది.

అనుకున్నదే చేస్తుండటంతో…..

నిజానికి రఘురామ కృష్ణంరాజు నిలకడలేని వ్యక్తి. తాను అనుకున్నది చేసేస్తారు. మనసలో ఉన్నది మాట్లాడేస్తారు. ఇది పార్టీలకు ఇబ్బంది అని చెప్పక తప్పదు. తొలుత బీజేపీ నాయకుడిగా రఘురామకృష్ణంరాజు రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 ఎన్నికలకు ముందు వరకూ వైసీపీలో ఉన్నారు. తీరా ఎన్నికల సమయానికి బీజేపీలోకి వెళ్లారు. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అయి పోయారు. తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసి నరసాపురం ఎంపీ టిక్కెట్ సాధించి రఘురామకృష్ణంరాజు విజయం చేజిక్కించుకున్నారు.

ఢిల్లీలో సొంత లాబీయింగ్…..

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. పార్టీ 22 మంది ఎంపీలు ఉన్నారు. అందరిదీ ఒక దారయితే రఘురామకృష్ణంరాజుది మరొక దారి అని చెప్పక తప్పదు. తన సొంత లాబీయింగ్ కోసమే ఢిల్లీలో ఎక్కువగా ఉంటున్నారని, పార్టీ నిర్ణయాలను థిక్కరిస్తున్నారని ఆయనపై వైసీపీ అధిష్టానం గత కొంతకాలంగా గుర్రుగా ఉంది. ఒకానొక సమయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ భావించింది. అయితే రఘురామకృష్ణంరాజు తన వివరణ నేరుగా జగన్ కు ఇచ్చుకుని బయటపడగలిగారు. కానీ ఢిల్లీలో మాత్రం తన పంథాను మార్చుకోలేదు.

అందుకే నియోజకవర్గంలో…..

దీంతో వైసీపీ అధిష్టానం ఆయన నియోజకవర్గంలోనే రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేసింది. ఇకపై పార్టీ కార్యక్రమాలకు రఘురామకృష్ణంరాజును పిలవరాదని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంచాలని నిశ్చయించింది. ఆయనను పార్టీ నేతలు ఎంపీగా చూడాల్సిన అవసరం లేదని అనధికారిక ఆదేశాలు వెల్లడియినట్లు చెబుతున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజు తనను పార్టీ కార్యక్రమాలకు పిలవకుంటే తాను ఎందుకని సన్నిహితుల వద్ద ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ అధిష్టానం నరసాపురం నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు అధికారాలకు అనధికారికంగా కత్తెర వేసినట్లు చెప్పుకుంటున్నారు. మరి రాజుగారు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News