వైసీపీకి రాజు ఇలా షాకిస్తారా?

చంద్రబాబుకూ జగన్ కి అసలు పడదు అన్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఈయన్ని ఆయన ఆయన్ని ఈయన చక్కగా ఫాలో అయిపోతారు. చంద్రబాబు [more]

Update: 2021-05-19 14:30 GMT

చంద్రబాబుకూ జగన్ కి అసలు పడదు అన్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఈయన్ని ఆయన ఆయన్ని ఈయన చక్కగా ఫాలో అయిపోతారు. చంద్రబాబు రాజకీయాల్లో కొన్ని కొత్త నిబంధలను ప్రవేశపెట్టారు. అవి బాగా వర్కౌట్ కావడంతో జగన్ కూడా చాలా సైలెంట్ గా వాటినే కాపీ కొడుతున్నారు అంటున్నారు. చంద్రబాబు జనాలను చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎవరెన్ని నీతి కబుర్లు చెప్పినా కులం మీద వ్యామోహం ప్రతీ వారికీ ఉంటుంది. అందుకే చంద్రబాబు ఏ కులం వారిని విమర్శించాలంటే ఆ కులం వారినే ప్రయోగించి అందులో సక్సెస్ అయ్యారు. దాని వల్ల ఆ పార్టీ మీద మొత్తం కులం నుంచి వ్యతిరేకత రకుండా జాగ్రత్త పడతారు అన్న మాట.

నిద్ర లేచారా…?

ఏపీలో క్షత్రియుల పాపులేషన్ తక్కువే కానీ రాజకీయంగా వారు బాగానే సౌండ్ చేస్తారు. విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాల్లో వారికంటూ కొన్ని సీట్లు ఉన్నాయి. ప్రతీ అసెంబ్లీలోనూ కనీసంగా అయిదుగురుకి తక్కువ కాకుండా ఎమ్మెల్యేలుగా ఉంటారు. మంత్రి పదవి కూడా వారికి కచ్చితంగా దక్కుతుంది. ఇదిలా ఉంటే రఘురామ క్రిష్ణం రాజు జగన్ తో గొడవ పెట్టుకుని ఇలా అయ్యాడు కానీ ఆయన పారిశ్రామికవేత్తగా ఉన్నారు, ధనవంతుడు కూడా. మరి అలాంటి రాజు మీద వైసీపీ నుంచి బాణాలు వేయాలంటే ఈ వైపు కూడా రాజుల సైన్యం ఉంటేనే బెటర్ అని వైసీపీ పెద్దలు భావించారేమో. అందుకే ఆ పార్టీలోని మొత్తం రాజులు నిద్ర లేచారు.

క్షత్రియుడు కాదా…?

క్షత్రియుడు అంటే రక్షించేవాడు అంటున్నారు విశాఖ ఉత్తర నియోజక‌వర్గం వైసీపీ ఇంచార్జి కె కే రాజు. ప్రజలను కాపాడాడమే సుక్షత్రియుల ధర్మం. అంతే తప్ప వారి మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టడం మా ఇంటా వంటా లేదు అని ఆయన అంటున్నారు. రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు తల్లి లాంటి పార్టీని దూషించడమే కాదు హద్దులు మీరారని కూడా ఆయన విమర్శించారు. అలాంటి రాజుకు యావత్తు క్షత్రియ సమాజం మద్దతు ఉండదంటే ఉండదు అని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు. ఆయనే కాదు, విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, విశాఖకు చెందిన మరో మాజీ ఎమ్మెల్సీ రాజు ఇలా చాలా మంది క్షత్రియులు అంతా ఒక్క చోట చేరి రఘురామ‌రాజుకు రామ్ రామ్ అంటూ తీర్మానమే చేసేశారు.

వర్కౌట్ అవుతుందా…?

నిజానికి వైసీపీకి రాజులతో చిక్కులు అన్నీ ఇన్నీ కాదు. రెబెల్ ఎంపీ రెండేళ్ళుగా చేస్తున్న విమర్శలకు తోడు వైసీపీ మంత్రుల వాచాలత్వం మూలంగా కూడా పార్టీ పట్ల కొంతమంది రాజులు అలిగారు అన్న మాట ఉంది. విజయనగరం రాజావారు పూసపాటి అశోక్ గజపతిరాజు మీద దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అప్పట్లో చేసిన కామెంట్స్ తోనే ఆ వర్గం గుస్సా అయింది. ఇక రెబెల్ ఎంపీ రాజు వివాదంతో అటూ ఇటూ మాటల తూటాలు పేలాయి. ఇపుడు కధ క్లైమాక్స్ కి చేరింది. రాజు అరెస్ట్ అయ్యారు కూడా. ఈ నేపధ్యంలో రాజుల మద్దతు వైసీపీకి ఎంత వరకూ ఉంటుంది అన్నది ఒక ప్రశ్న అయితే రఘురామ కృష్ణంరాజు విషయంలో తప్పు జరిగినా ప్రభుత్వ పెద్దలు కూడా దాన్ని కెలికి మరీ చాట చేశారు అన్న మాట కూడా ఉంది. మొత్తానికి ఉత్తరాంధ్రా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ క్షత్రియులు రాజుని విమర్శిస్తున్నా వారే మొత్తం సామాజిక వర్గం కాదు కదా అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి రఘురామ కృష్ణంరాజు రేపిన చిచ్చు వైసీపీకి ఎలాంటి షాక్ ఇస్తుందో.

Tags:    

Similar News