టచ్ చేసి చూడమంటున్న బీజపీ ?

ఏపీలో రధాల రాజకీయం మొదలైంది. రధయాత్ర అంటే ఇంతవరకూ జగన్నాధుని రధ యాత్రనే ఏపీ జనం చూశారు. కానీ రాజకీయ రధాలను ఇపుడు ఏపీలో జోరుగా తిప్పబోతున్నారు. [more]

Update: 2021-01-29 03:30 GMT

ఏపీలో రధాల రాజకీయం మొదలైంది. రధయాత్ర అంటే ఇంతవరకూ జగన్నాధుని రధ యాత్రనే ఏపీ జనం చూశారు. కానీ రాజకీయ రధాలను ఇపుడు ఏపీలో జోరుగా తిప్పబోతున్నారు. ఈ రధాలను కూడా ఏకంగా పది జిల్లాలు కవర్ చేసేలా టూర్ ప్లాన్ చేసి మరీ నడపనున్నారు. అంటే ఒక విధంగా ఏపీలో కొత్త రాజకీయానికి తెర తీసినట్లే. ఇప్పటిదాకా ఏపీలో తెలుగుదేశం పార్టీ మాత్రమే పోటీగా కార్యక్రమాలు నిర్వహించేది. కానీ ఇపుడు చూస్తే మాత్రం బీజేపీ దూకుడు గా సాగుతోంది.

సమయం చూసి మరీ….

ఏపీలో బీజేపీ రధ యాత్ర చాలా టైమ్లీగా చేస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి 12 వరకూ సాగే ఈ రధయాత్ర టార్గెట్ ఏంటి అన్నది అందరికీ తెలిసిందే. ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అర్జంటుగా జరగనుంది. దాని నోటిఫికేషన్ కూడా 12 తరువాతనే వస్తుంది. అంటే దానికి ముందే రధాన్ని పరుగులెత్తించి వేడి రగిలిస్తే అందులో చలి కాచుకోవచ్చు అన్న ఆలోచన అయితే బీజేపీలో ఉంది. అందుకే కపిలతీర్ధం టూ రామతీర్ధం అని కూడా పేరు పెట్టి మరీ రచ్చ చేస్తోంది.

రధం కింద నలిగేది …..

ఇక ఏపీలో బీజేపీ జనసేన కూటమిగా ముందుకు వస్తోంది. అందులో జనసేన కూడా తిరుపతి నుంచి పోటీ చేయడానికి చూస్తోంది. ఈ పరిణామాలతో జనసేన కంటే తాను చాలా అడుగులు ముందు అని మిత్రుడికి గట్టిగా చెప్పడానికే ఈ రధయాత్రను ఎంచుకున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. ఈ రధయాత్రకు వచ్చే స్పందనను చూసిన తరువాత జనసేన ఇక ఎమీ మాట్లాడకపోవచ్చు, మద్దతు పార్టీగానే మిగిలిపోవచ్చు అన్న కొత్త ఎత్తుగడతోనే స్కెచ్ వేశారని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీకి క్రాస్ చేసి ముందుకు రావాలన్నా, జనం నోళ్ళల్లో బాగా నానాలన్నా కూడా రధయాత్ర తోనే సాధ్యమని బీజేపీ గట్టిగా నమ్ముతోందిట. ఇలా ఏపీలో తనకు అడ్డుగా ఉన్న రాజకీయాన్ని రధ చక్రాల కింద నలిపేయాలన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్ అని చెబుతున్నారు.

అడ్డుకుంటే అరాచకమే…?

రధయాత్ర అంటేనే ఒక ఎమోషనల్ ప్రోగ్రాం. దాన్ని అడ్డుకోవాలని చూసినా ఇబ్బందే. అలాగే వదిలేసినా డేంజరే. సరిగా ఈ పాయింట్ తోనే అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ కిందా మీదా అవుతోందిట. ఎలాగైనా పొలిటికల్ మైలేజ్ కచ్చితంగా బీజేపీకి రావడం ఖాయమని అంటున్నారు. ఇక పది జిల్లాలలో వారం రోజుల పాటు బీజేపీ దూకుడు సాగితే ఏపీ రాజకీయం మారుతుందన్న బెంగ కూడా వైసీపీ నేతలలో ఉంది. కానీ ఏమీ చేయాలో పాలు పోవడంలేదుట. మొత్తానికి బీజేపీ సెంటిమెంట్ రధాన్ని టచ్ చేయాలంటే కూడా వైసీపీ భారీ రిస్క్ చేయాల్సిందే అన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News