రాచమల్లుకు రాజకీయ భయం..?

రాజకీయాల్లో తన మన ఉండవు. నెంబరు 2 స్థానాన్ని ఎవరూ అంగీకరించరు. తనతో సమానంగా ఎదిగే వారిని తొక్కేయడానికే చూస్తారు. భవిష్యత్ లో తనకు పోటీ అవుతారన్న [more]

Update: 2021-07-26 08:00 GMT

రాజకీయాల్లో తన మన ఉండవు. నెంబరు 2 స్థానాన్ని ఎవరూ అంగీకరించరు. తనతో సమానంగా ఎదిగే వారిని తొక్కేయడానికే చూస్తారు. భవిష్యత్ లో తనకు పోటీ అవుతారన్న అనుమానం కావచ్చు. భయం కూడా కావచ్చు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇదే పరిస్థిితిని ఎదుర్కొంటున్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రెండు సార్లు ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లోెనూ హ్యాట్రిక్ విజయం సాధించాలనుకుంటున్నారు.

జగన్ ను ఆరాధించే…?

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు నమ్మిన బంటు. జగన్ ను ఆరాధించే ఎమ్మెల్యేల్లో రాచమల్లు ఒకరు. వీర విధేయుడిగా పేరపొందిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలో ఇప్పుడు భయం మొదలయింది. దీనికి కారణం ఎవరో కాదు. తాను అత్యంతగా నమ్మి, ఆరాధించే జగనే కారణం. తనను ప్రొద్దుటూరు రాజకీయాల నుంచి సైడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుమానం.

ఎమ్మెల్సీ ఇచ్చినందుకు….

ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ప్రొద్దుటూరు కు చెందిన రమేష్ యాదవ్ కు జగన్ కేటాయించారు. బీసీ సామాజికవర్గానికి కేటాయింపుల్లో భాగంగా ఇచ్చారని అందరూ భావించారు. కానీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆలోచన వేరే విధంగా ఉంది. తనకు భవిష్యత్ లో చెక్ పెట్టడానికే రమేష్ యాదవ్ ను జగన్ ఎమ్మెల్సీని చేశారన్న అనుమానం ఆయనను పట్టి పీడిస్తుంది.

ఆయనపై నిఘా…..

దీనికి తోడు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అయిన వెంటనే ఆయన సామాజికవర్గం నేతలు ఆయన పంచన చేరిపోయారు. ఇది రాచమల్లుకు మరింత అవమానంగా మారింది. అందుకే రమేష్ యాదవ్ ను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేయాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్గీయులు నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఆయన కార్యాలయంపై నిఘా ఉంచారు. ఆయనను కలుస్తున్న వ్యక్తులకు వార్నింగ్ లు కూడా వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కే వార్నింగ్ కాల్స్ వచ్చాయి. దీని వెనక ఎవరున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తం మీద ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కి రాజకీయ బతుకు భయం పట్టుకుందన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News