అందుకే ఇక్కడ పక్కన పెట్టారా?

కేంద్ర మాజీ మంత్రి పురంద్రీశ్వరికి రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. దీనికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. ఒకటి కన్నా వర్గంగా పురంద్రీశ్వరికి ముద్రపడటం. మరో కారణం కేంద్రంలో [more]

Update: 2020-09-28 09:30 GMT

కేంద్ర మాజీ మంత్రి పురంద్రీశ్వరికి రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. దీనికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. ఒకటి కన్నా వర్గంగా పురంద్రీశ్వరికి ముద్రపడటం. మరో కారణం కేంద్రంలో ఏదైనా పదవి వస్తుందన్న సంకేతాలని చెబుతున్నారు. నిజానికి పురంద్రీశ్వరి జాతీయ మహిళా మోర్చా కు అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ హయాంలో కొంత దూకుడుగా ఉన్న పురంద్రీశ్వరి సోము వీర్రాజు నియమితులయ్యాక స్లో అయ్యారు.

సోమును వ్యతిరేకించిన……

సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కాకుండా వ్యతిరేకించిన వారిలో పురంద్రీశ్వరి ఒకరంటున్నారు. కేంద్ర నాయకత్వం వద్ద పురంద్రీశ్వరి సోము వీర్రాజుపై నెగిటివ్ అభిప్రాయం చెప్పారని, అందుకే సోము తన టీంలో పురంద్రీశ్వరిని చేర్చుకోలేదని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. రాజధాని అమరావతి విషయంలోనూ టీడీపీ వాదనను సమర్థించే విధంగా పురంద్రీశ్వరి మాట్లాడటం కూడా నచ్చలేదంటున్నారు.

కన్నా ఉన్నప్పుడు……

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రోజూ మీడియా సమావేశంలో కన్పించేవారు. రాజధాని అమరావతి రైతులకు మద్దతు పలికారు. కన్నా లక్ష్మీనారాయణ సయితం పురంద్రీశ్వరికి మంచి ప్రాధాన్యత ఇచ్చేవారు. పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు. అన్ని జిల్లాలను పర్యటిస్తూ ప్రధానంగా వైసీపీ, టీడీపీ పాలనలను ఎండగట్టేవారు. కానీ గత కొంతకాలంగా పురంద్రీశ్వరి సైలెంట్ గా ఉన్నారు. ఇంటికే పరిమితమయ్యారు.

కేంద్రం కమిటీలో పదవి….?

దీనికి ప్రధాన కారణం కేంద్రంలో ఏదో పదవి వస్తుందని ఆమె ఆశించడమే. నిజానికి పురంద్రీశ్వరికి రాష్ట్ర కమిటీలో చోటు దక్కాల్సి ఉంది. అయితే కేంద్ర కమిటీలో పదవి వస్తుందని అక్కడి నుంచి సంకేతాలు రావడంతోనే చిన్నమ్మ పేరును చివరి నిమిషంలో తీసేశారన్న ప్రచారమూ ఉంది. ఎన్టీఆర్ తనయగా కేంద్రంలోనూ గుర్తింపు తెచ్చుకున్న పురంద్రీశ్వరికి మొత్తం మీద జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కడంతో ఆమె వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News