చిన్నమ్మలో ఆ అసహనం ఎందుకు…?

భారతీయ జనతా పార్టీలో పురంద్రీశ్వరి కంఫర్ట్ గా లేరా? ఆమె అనుకున్న పదవులు లభించడం లేదన్న అసహనంతో ఉన్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ [more]

Update: 2020-09-06 08:00 GMT

భారతీయ జనతా పార్టీలో పురంద్రీశ్వరి కంఫర్ట్ గా లేరా? ఆమె అనుకున్న పదవులు లభించడం లేదన్న అసహనంతో ఉన్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకూ దూకుడుగా ఉన్న పురంద్రీశ్వరి గత కొద్ది నెలలుగా మౌనంగా ఉంటున్నారు. పెద్దగా పార్టీ యాక్టివిటీస్ లో కూడా పాల్గొనడం లేదు. కరోనా కారణంగా అని పార్టీ నేతలు పైకి చెబుతున్నప్పటికీ కొంతకాలంగా పురంద్రీశ్వరి పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంపీ టిక్కెట్ ఇచ్చినా….

మొన్నటి ఎన్నికల్లో పురంద్రీశ్వరి బీజేపీ అభ్యర్థిగా విశాఖ పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పురంద్రీశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీలన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంద్రీశ్వరి కోసం వైసీపీకి దూరమయ్యారు. పురంద్రీశ్వరికి బీజేపీ లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

ఎంతో ఆశించి….

నిజానికి పురంద్రీశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. రాజ్యసభకు ఎంపిక చేసి పురంద్రీశ్వరిని కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేస్తారని భావించారు. కానీ పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆ ఆలోచనే లేదని స్పష్టమయింది. ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా ఎవరినీ తీసుకునే అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా దక్కుతుందని పురంద్రీశ్వరి ఆశించారు.

ఏపదవీ దక్కదని….

కానీ సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో ఇక కనుచూపు మేరలో పదవులు దక్కవన్న నిరాశలో పురంద్రీశ్వరి ఉన్నట్లు కనపడుతుంది. మరోవైపు ప్రస్తుత కేంద్ర నాయకత్వం, రాష్ట్ర బీజేపీలు సయితం వైసీపీకి లోపాయికారీగా మద్దతివ్వడాన్ని కూడా పురంద్రీశ్వరి వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షాన్ని మాత్రమే టార్గెట్ చేయడమేంటని? రాజధాని విషయంలో పార్టీ తీసుకున్న స్టాండ్ ను కూడా ఆమె తప్పుపడుతున్నారు. అందుకే పురంద్రీశ్వరి ప్రస్తుతం మౌనంగా ఉండటమే మేలని భావిస్తున్నారు. కుటుంబానికే ఆమె ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

Tags:    

Similar News