చిన్నమ్మ దశ తిరుగుతుందట

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎంతగా ప్రయత్నం చేసినా ఫలితం ఉండకపోవచ్చునని బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరో మారు ఏపీ ప్రెసిడెంట్ పదవి కోసం [more]

Update: 2020-01-15 00:30 GMT

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎంతగా ప్రయత్నం చేసినా ఫలితం ఉండకపోవచ్చునని బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరో మారు ఏపీ ప్రెసిడెంట్ పదవి కోసం కన్నా లక్ష్మీనారాయణ చాలా దారులే తొక్కారు. ఒకనాడు తనను తీవ్రంగా ద్వేషించి ఇంటి ముందు రాళ్ళేయించిన టీడీపీతో కూడా అయన చివరకు జత కట్టారు. బాబు ఆడమన్నట్లుగా ఆడారు. బీజేపీ విధానాలు పక్కన పెట్టి మరీ జగన్ మీద భారీ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఇదంతా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ద్వారా హైకమాండ్ ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగమే. అయితే కన్నా ఆశలు అడియాశలు కాక తప్పదని అంటున్నారు. కన్నా వల్లా పార్టీ బాగుపడకపోగా మరిన్ని చీలికలు పేలిలకు అయిందన్న నివేదికలు హై కమాండ్ వద్ద ఉన్నాయట. దాంతో ఆయన్ని తొందరలోనే ఇంటికి పంపించేస్తారని అంటున్నారు.

ముందున్న చిన్నమ్మ….

ఇంతకాలం పెద్దగా చడీచప్పుడు చేయని దగ్గుబాటి పురంధేశ్వరి ఇపుడు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ రేసులో ముందున్నారట. ఆమెకు బలమైన కమ్మ సామజికవర్గం ప్లస్ అయితే, ఎన్టీయార్ కుమార్తె ట్యాగ్ రెండవ ప్లస్. ఇక టీడీపీ అధినేత అంటే అసలు పడకపోవడం మూడవ ప్లస్ పాయింట్. ఇవే బీజేపీకి కూడా కావాల్సినవి. బాబుని తొక్కిపెట్టి ఏపీలో బీజేపీని పెద్ద చేద్దామనుకుంటున్న కమలనాధులకు బెస్ట్ ఆప్షన్ గా చిన్నమ్మ కనిపిస్తోందట. దానికి తోడు ఆమెకు మంచి వాగ్దాటి ఉండడం. అన్ని భాషల్లో పట్టు ఉండడం కూడా ఈ పదవికి కలిసివస్తున్నాయని అంటున్నారు. ఆమె పుట్టినిల్లు కోస్తా అయితే, మెట్టినిల్లు ప్రకాశం జిల్లా కావడంతో అన్ని వైపులా నుంచి ఆమెకు మద్దతు వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.

పీవీ కుటుంబం కూడానా..?

మరో వైపు బీజేపీ ఉమ్మడి ఏపీకి తొలి ప్రెసిడెంట్ గా ఉన్న పీవీ చలపతిరావు కుమారుడు, ఎమ్మెల్సీ అయిన పీవీఎన్ మాధవ్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. బీసీ వర్గానికి చెందిన మాధవ్ అధ్యక్షుడు అయితే ఉత్తరాంధ్రాలో పార్టీ పటిష్టం అవుతుందని ఒక అంచనా ఉంది. పైగా ఆయన తండ్రి రాజకీయ వారసత్వం కూడా కలసివస్తుందని, యువకుడు కావడం, విశాఖ రాజధాని అయితే మాధవ్ లాంటి వారు అక్కడ నుంచి పార్టీని నడిపించగలరన్న నమ్మకం కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరో పది రోజుల్లో….

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కధ మరో పది రోజుల్లో తేలిపోతుందని అంటున్నారు. పురంద్రీశ్వరి ఎక్కువగా అవకాశాలు ఉండడంతో ఆమె పేరుని ప్రకటిస్తారని అనుచరులు భావిస్తున్నారు. మరో వైపు ఏపీ రాజకీయాలో ఒక మహిళకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ వర్గాన్ని కూడా ఆకట్టుకోవాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో నష్టపోతోంది మాత్రం కన్నావేనని అంటున్నారు. ఆయన అప్పట్లో వైసీపీలోకి వెళ్దామనుకుని తట్టా బుట్టా సర్దుకున్నాక వెనక్కు రప్పించి కిరీటం పెట్టారు. ఇపుడూ వైసీపీ మీద మంచి ఫోర్స్ గా వెళ్తూంటే పక్కన పెడుతున్నారు. దాంతో కన్నా రెంటికీ చెడిపోయారని అంటున్నారు. ఏమైనా అనూహ్య పరిణామాలు జరగకపోతే మాత్రం చిన్నమ్మ ఏపీ కొత్త ప్రెసిడెంట్ అవుతారని, మరో పది రోజుల్లో ఈ నిర్ణయం ప్రకటిస్తారని అంటున్నారు.

Tags:    

Similar News