చిన్నమ్మను అడ్డుకుంటున్నదెవరు..?

తెలుగు రాజకీయాల్లో కీలకమైన నాయకులుగా ఎదిగిన ఇద్దరు నేతలు ఇప్పుడు భీకర పోరుకు దిగారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు రెడీ అయ్యారు. ఎందుకిలా జరుగుతోంది? అసలు [more]

Update: 2019-08-03 06:30 GMT

తెలుగు రాజకీయాల్లో కీలకమైన నాయకులుగా ఎదిగిన ఇద్దరు నేతలు ఇప్పుడు భీకర పోరుకు దిగారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు రెడీ అయ్యారు. ఎందుకిలా జరుగుతోంది? అసలు వారెవరు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విషయంలోకి వెళ్తే 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన దివంగ‌త ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీర్వాదంతో కాంగ్రెస్ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు. బాప‌ట్ల నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వరి ఆ త‌ర్వాత ఆ సీటు రిజ‌ర్వ్ కావ‌డంతో విశాఖ ఎంపీ సీటును కైవసం చేసుకుని 2009లో విజయం సాధించారు.

తనకే అవకాశమని…

ఈ క్రమంలోనే ఆమెకు కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కింది. సమయానికి అనుకూలంగా మాట్లాడగలిగిన నాయకుల్లో ఒకరుగా పురందేశ్వరి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ వాదిగా అనతి కాలంలోనే గుర్తింపు పొందారు. అయితే, 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో పురందేశ్వరి కాంగ్రెస్‌లో ఉంటే భవితవ్యం ఉండదని గుర్తించి పార్టీ మారి బీజేపీ చెంతకు చేరిపోయారు. ఈ క్రమంలోనే ఆ ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేసి పురందేశ్వరి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీలోనే కొనసాగారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో తనకు మేలు జరుగుతుందని పురందేశ్వరి భావించారు. అయితే, అప్పట్లో ఆమె ఆశించిన విధంగా రాజ్యసభ సీటు దక్కలేదు.

ఒకరికి ఇవ్వాలని….

ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లో తనకు ఇష్టమైన విశాఖ ఎంపీ సీటును కైవసం చేసుకుని పురందేశ్వరి ముందుకు సాగారు. అయితే, ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌ సునామీ ముందు ఆమె కూడా ఓటమిపాలయ్యారు. ఇక, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ఏపీలో ఎదగాలని నిర్ణయించుకున్న క్రమంలో ఒకరికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ముందుగా కంభంపాటి హ‌రిబాబు పేరు వినిపించినా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వడం వ‌ల్ల ఒరిగేది లేద‌ని డిసైడ్ అయిన అధిష్టానం ఇప్పుడు ఈ ఛాన్స్ వేరే వాళ్లకు ఇచ్చే ఆలోచ‌న‌లోనే ఉంది.

పోటీకి వచ్చిన….

ఈ క్రమంలో ఈ బెర్త్‌ తనకే దక్కుతుందని, తనకు రాజ్యసభ సీటుతోపాటు కేంద్రంలోని మంత్రి పదవి కూడా దక్కడం ఖాయమని పురందేశ్వరి అనుకున్నారు. అయితే, ఇంతలోనే టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా రెండో పర్యాయం కూడా కొనసాగుతున్న సుజనా చౌదరి ఇటీవల బీజేపీలోకి చేరిపోయారు. ఆయన కూడా కేంద్రంలోని మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తనకు తెలిసిన అత్యంత ముఖ్యుల ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో తన బెర్త్‌ను సుజనా ఎక్కడ దక్కించుకుంటారోనని పురందేశ్వరి మద‌న పడుతున్నారని తెలుస్తోంది. దీనిపై కమల నాథులు ఎక్కడా పెదవి విప్పడం లేదు. దీంతో ఇప్పుడు సుజనా వర్సెస్‌ పురందేశ్వరి ల మధ్య కేబినెట్ బెర్త్‌ కోసం ఫైటింగ్‌ వీర లెవల్లో సాగుతోందని అంటున్నారు. మరి ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Tags:    

Similar News