దిద్దుబాటులో భాగంగానేనా ?

పంజాబ్ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఎందుకంటే పంజాబ్ లో మరోసారి గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్ లో కన్పించడమే. ప్రస్తుతం [more]

Update: 2021-03-30 17:30 GMT

పంజాబ్ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఎందుకంటే పంజాబ్ లో మరోసారి గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్ లో కన్పించడమే. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ రాష్ట్ర దక్కే అవకాశాలు నేరుగా లేకపోయినా వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది. పంజాబ్ రాష్ట్రం అన్ని రకాలుగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది.

అంతా అనుకూలంగానే…..

పంజాబ్ లో రైతులు మూడు వ్యవసాయ చట్టాలపై ఉద్యమం చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నెలలు తరబడి ఆందోళన చేస్తున్నారు. పంజాబ్ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు అఖండ విజయం దక్కింది. బీజేపీ, శిరోమణి అకాలీదళ్ లను పంజాబ్ ప్రజలు పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమని కాంగ్రెస్ గట్టిగా భావిస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై వెనక్కు తగ్గినా తమ వైపే ఉంటారని కాంగ్రెస్ గట్టిగా భావిస్తుంది.

బలంగా ఉన్నా….

అమరీందర్ సింగ్ నాయకత్వంలో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గత ఎన్నికలలోన అఖండ విజయం సాధించింది. అయితే పార్టీలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పడింది. బీజేపీ నుంచి వచ్చి చేరి కాంగ్రెస్ లో మంత్రి పదవి చేపట్టిన నవజ్యోత్ సిద్దూకు, ముఖ్యమంత్రి అమరీందర కు గత కొంతకాలంగా పడటం లేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో నవజ్యోత్ సిద్దూను చల్లబరిచే ప్రయత్నంలో అధిష్టానం పడింది.

సిద్ధూను సంతృప్తి పర్చేందుకు…..

నవజ్యోత్ సిద్దూ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరగానే ఆయనకు మంత్రి పదవి దక్కింది. సిద్దూ ఇమ్రాన్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సిద్దూ అక్కడి సైనికాధిపతి జనరల్ బజ్వాను ఆలింగనం చేసుకోవడం వివాదంగా మారింది. తర్వాత సిద్దూను అమరీందర్ క్రమంగా పక్కన పెట్టడం ప్రారంభించారు. ఈనేపథ్యంలో మరోసారి అధిష్టానం సిద్దూకు పంజాబ్ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దూను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేయాలని భావిస్తుంది. మొత్తం మీద పంజాబ్ ను సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్ ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది.

Tags:    

Similar News