పుదుచ్చేరి అంత సులువు కాదట

పుదుచ్చేరి అతి చిన్న రాష్ట్రం. అయినా ఈ ఎన్నికలు రెండు జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా కాంగ్రెస్ [more]

Update: 2021-04-15 18:29 GMT

పుదుచ్చేరి అతి చిన్న రాష్ట్రం. అయినా ఈ ఎన్నికలు రెండు జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా కాంగ్రెస్ ను పాలనను సజావుగా జరగకుండా బీజేపీ అడుగడుగునా అడ్డుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే బీజేపీకి కూడా ఇక్కడ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. బలమైన పార్టీలతో కలసి బీజేపీ ఈసారి పుదుచ్చేరి బరిలోకి దిగింది.

30 స్థానాలకు…..

పుదుచ్చేరిలో మొత్తం 33 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో మూడింటిలో సభ్యులు నామినేట్ అవుతారు. ప్రస్తుతం 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పదహారు స్థానాలను దక్కించుకున్న వారు అధికారంలోకి వస్తారు. ఈసారి మొన్నటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి ఈసారి పోటీ చేయడం లేదు. ఆయన పై అసమ్మతి తీవ్రంగా ఉండటంతో పార్టీ అధిష్టానం నారాయణ స్వామికి ప్రచార బాధ్యతలను మాత్రమే అప్పగించింది.

తమిళనాడు వేవ్….

తమను పాలన చేయకుండా ఎలా అడ్డుకున్నదీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరిస్తుంది. డీఎంకే తో కలసి కాంగ్రెస్ పుదుచ్చేరిలో పోట ీచేస్తుంది. తమిళనాడులో డీఎంకేకు సానుకూల పవనాలు వీస్తుండంటంతో ఇక్కడ కూడా తమకు అదే వేవ్ కొనసాగుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకోసమే కాంగ్రెస్ అధికారం నిలుపుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. రాహుల్ గాంధీ సయితం ప్రచారంలో పాల్గొంటున్నారు.

బీజేపీ గట్టి ప్రయత్నం…..

ఇక పుదుచ్చేరిలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. బీజేపీ ఇక్కడ అన్నాడీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్ లతో కలసి బరిలోకి దిగింది. మోదీతో సహా కేంద్ర మంత్రులందరూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కూడా మ్యానిఫేస్టోలో ప్రకటించింది. బీజేపీ కూటమి విజయం సాధిస్తే రంగస్వామి ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు. ఇలా పుదుచ్చేరిలో బీజేపీ, కాంగ్రెస్ హోరా హోరీ తలపడ్డాయి. మరి విజయం ఎవరివైపు అన్నది మే 2వ తేదీన తేలనుంది.

Tags:    

Similar News