జగన్ పాలనపై జనం పల్స్

ఎన్నో ఆశ‌లు, మ‌రెన్నో ఆశ‌యాల‌తో ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుడి మాదిరిగా ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటి.. ఏపీని హ‌స్తగతం చేసుకున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. అనుభ‌వ శూరుడిగా పేరు [more]

Update: 2019-08-19 02:00 GMT

ఎన్నో ఆశ‌లు, మ‌రెన్నో ఆశ‌యాల‌తో ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుడి మాదిరిగా ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటి.. ఏపీని హ‌స్తగతం చేసుకున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. అనుభ‌వ శూరుడిగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబును సైతం ప‌క్కకు నెట్టి, మార్పు తెస్తానంటూ.. ముందుకు వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వ‌న్‌ను సైతం ప‌డ‌గొట్టి.. ప్రజ‌ల‌తో జై కొట్టించుకున్నారు. న‌వ్యాంధ్ర ప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ఈ ఏడా ది మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. తాను ఎన్నిక‌ల‌కు ముందు ప్రక‌టించిన మేనిఫెస్టోలోని న‌వ‌రత్నాల నే ప్రామాణికంగా చేసుకుని ముందుకు సాగుతాన‌ని, వాటిని అమ‌లు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగు తాన‌ని ఆయ‌న ప్రక‌టించారు.

తొలి నెల రోజుల్లోనే….

ఈ క్రమంలోనే ఆయ‌న తొలి నెల పాల‌న ముందుకు సాగింది. అనేక ప‌థ‌కాల‌ను ప్రవేశ పెట్టారు. అవినీతి ర‌హిత పాల‌న అంటే.. సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు. అక్రమ క‌ట్టడాల‌పై క‌న్నెర్ర చేస్తానంటూ.. 9 కోట్లతో నిర్మించిన ప్రజావేదిక‌ను కూల్చేశారు. చంద్రబాబును అవినీతి ప‌రుడుగా చూపించే క్రమంలో సాహ‌సోపేత నిర్ణయంతో ముందుకు సాగారు. మంత్రి వ‌ర్గం కూర్పులో గ‌తంలో ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం చేశారు. తాను రెడ్డి సామాజిక వ‌ర్గం అయి ఉండి, త‌న గెలుపున‌కు, త‌న పార్టీ నిల‌క‌డ‌కు కూడా సాయం చేసిన ఈ వ‌ర్గాన్ని సైతం ప‌క్కన పెట్టి.. సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌ను భుజాన వేసుకున్నారు.

అనేక పథకాలతో….

అదే స‌మ‌యంలో ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను తెర‌మీదికి తెచ్చి అన్నీ వెనుకబడిన వర్గాల వారితోనే భ‌ర్తీ చేశారు. మైనార్టీ ముస్లిం, కాపుల‌కు పెద్దపీట వేశారు. ఇది జ‌గ‌న్ రేంజ్‌ను ఆకాశానికి ఎత్తేసింది. అదేస‌మ యంలో యువ‌త‌కు ఉపాధి క‌ల్పన పేరుతో దాదాపు 4 ల‌క్షల వలంటీర్లు, 1.4 ల‌క్షల స‌చివాల‌య పోస్టుల ను భ‌ర్తీ చేసేందుకు ప్రక‌టించారు. అదే స‌మ‌యంలో అమ్మ ఒడి స‌హా అనేక సంక్షేమ ప‌థ‌కాల‌కు తొలి నెల‌లోనే నాంది ప‌లికారు. ఇక‌, ప్రతిప‌క్షం విమర్శలు గుప్పిస్తున్న పొరుగు రాష్ట్రం తెలంగాణ‌తో స్నేహ హ‌స్తాన్ని చాటారు. ఇవ‌న్నీ.. తొలి నెల‌లో జ‌గ‌న్‌ను దేవుడిని చేశాయి. విమ‌ర్శకులు సైతం ఆయ‌న‌ను మెచ్చుకునేలా చేశాయి.

ఇసుక దెబ్బకు….

ఇక‌, రెండో నెల‌కు వ‌చ్చే స‌రికి మాత్రం కొన్ని వ్యతిరేక‌త‌లు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్షల సంఖ్యలో కార్మికులు ఆధార‌ప‌డిన గృహ నిర్మాణ రంగం దెబ్బతింది. జ‌గ‌న్ తీసుకున్న ఇసుక నిలిపి వేత నిర్ణయంతో ఈ రంగం కుదేలైంది. అదే స‌మ‌యంలో ఆయ‌న అన్న క్యాంటీన్ల మూసివేత కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శల‌కు కార‌ణ‌మైంది. ఇక‌, పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుంద‌ని చెబుతూనే, దీనిలో న‌వ‌యుగ సంస్థను త‌ప్పించ‌డం, మ‌రోసారి రివ‌ర్స్ టెండ‌ర్లు పిల‌వాల‌ని చూడ‌డం, దీనికి ప్రతిప‌క్షం స‌హా కేంద్రం , ఇత‌ర దేశాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేక‌త‌లు రావ‌డం గ‌మ‌నార్హం.

తెల్ల రేషన్ కార్డులు….

ఇక‌, ఇసుక విధానంపైమౌనం వ‌హించ‌డం కూడా జ‌గ‌న్‌కు చెడ్డపేరు మోసుకొచ్చింది. అదే స‌మ‌యంలో రేష‌న్ కార్డుల ఏరివేత కూడా ముఖ్యంగా ఇబ్బంది క‌రంగా మారింది. నిజానికి తెల్ల రేష‌న్ కార్డుల వ్యవ‌హారం.. ఏ ప్రభుత్వానికైనా త‌ల‌నొప్పిగా మారిన వ్యవ‌హార‌మే. అయితే, ఓటు బ్యాంకుతో కూడుకున్న సెంటిమెంట్ వ్యవ‌హారం కావ‌డంతో అనేక ప్రభుత్వం చూసీచూడ‌న‌ట్టు వ్యవ‌హ‌రించాయి. కానీ, జ‌గ‌న్ ఖ‌చ్చితంగా పేద‌ల‌కు మాత్రమే దీనిని అమ‌లు చేస్తాన‌ని, మిగిలిన వారిని జ‌ల్లెడ‌ప‌ట్టి వెతికి మ‌రీ తొల‌గిస్తాన‌ని చెప్పడం విమ‌ర్శల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఇలా రెండు నెలల పాల‌న‌లోకొంత తీపి, మ‌రికొంత పులుపు, ఇంకొంత చేదుల‌తో జ‌గ‌న్ పాల‌న ఉగాదిప‌చ్చడిని త‌ల‌పిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News