ప్రొఫెసర్ కు ఈసారి అంత సులువు కాదా?

ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోసారి ఎన్నికల బరిలోకిదిగుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈసారి ఎన్నికలు ఉండబోవన్నది విశ్లేషకుల అంచనా. నాగేశ్వర్ స్వయంగా విశ్లేషకుడే. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి [more]

Update: 2020-10-09 11:00 GMT

ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోసారి ఎన్నికల బరిలోకిదిగుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈసారి ఎన్నికలు ఉండబోవన్నది విశ్లేషకుల అంచనా. నాగేశ్వర్ స్వయంగా విశ్లేషకుడే. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్బభద్రుల నియోజకవర్గం నుంచి నాగశ్వర్ పోటీకి రెడీ అయ్యారు. ఇది ఆయనకు కొత్తకాదు. గతంలోనూ ఇదే నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించారు.

వామపక్ష భావాజాలంతో…..

ప్రొఫెసర్ నాగేశ్వర్ వామపక్ష భావాలు గల వ్యక్తి. ఆయన వామపక్ష పార్టీలకు దగ్గరగా ఉంటారు. ఏ పార్టీతో సంబంధం ఉండదు. కానీ ప్రజాసమస్యలపై ఆయన స్పందించే తీరు ప్రజలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యువతకు ఆయన ఇచ్చే గైడెన్స్ మెచ్చుకోదగింది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసే విశ్లేషణలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఉన్నది ఉన్నట్లు చెప్పై నైజం నాగేశ్వర్ ది. ఆయన ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని విశ్లేషణలు అందిస్తున్నారు.

గతంలో ఎన్నికై….

అందుకే ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గతంలో ఎన్నికయ్యారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో ఒక స్థాయితో మాత్రమే ఓటర్లు ఉంటారు. వారు తమ ఓటుహక్కును సరైన వ్యక్తికి వేస్తారన్న నమ్మకం నాగేశ్వర్ ది. ఇప్పుడు రాజకీయనేతలకు ఓటు వేసినా వారు ఆ పార్టీలో ఉంటారన్న గ్యారంటీ అయితే లేదు. ఇది నాగేశ్వర్ కు సానుకూలంగా మారుతుందని అంటున్నారు.

బరిలో అన్ని పార్టీలూ…..

అయితే ఈసారి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎన్నికల్లో అన్ని పార్టీలూ పోటీ చేయడానికి రెడీ అయ్యాయి. కాంగ్రెస నుంచి వంశీ చందర్ రెడ్డితో సహా అనేక మంది టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమయింది. బీజేపీ ఎటూ పోటీలో ఉంటుంది. అధికార టీఆర్ఎస్ తనదే గెలుపు అన్న ధీమాలో ఉంది. ఇన్ని రాజకీయ పార్టీల నడుమ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు విజయావకాశాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర అభ్యర్థి కావడంతో చివరి నిమిష‌ంలో కొన్ని పార్టీలూ ఆయనకు మద్దతు ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News