ప్రియాంక… మొండితనం…!!

ప్రియాంక గాంధీ… ఉత్తరప్రదేశ్ లో ఆమె పర్యటన కలకలం రేపింది. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ పై దృష్టి పెట్టారు. సోదరుడు రాహుల్ గాంధీ అమేధీలో ఓటమితో కుంగిపోకుండా [more]

Update: 2019-07-21 18:29 GMT

ప్రియాంక గాంధీ… ఉత్తరప్రదేశ్ లో ఆమె పర్యటన కలకలం రేపింది. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ పై దృష్టి పెట్టారు. సోదరుడు రాహుల్ గాంధీ అమేధీలో ఓటమితో కుంగిపోకుండా ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీ ప్రక్షాలనకు ఆమె నడుంబిగించారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ పార్టీ చీఫ్ గా ప్రియాంక గాంధీ నియమితులైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ భూవివాదంలో కాల్పుల ఘటనలో పది మంది మృతి చెందారు.

మృతుల కుటుంబాలకు….

సోనాభద్ర కాల్పుల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రియాంక గాంధీని అడ్డుకుంది. అయితే ప్రియాంక అక్కడే బైఠాయించి పోలీసుల తీరును నిరసించారు. తర్వాత ప్రియాంక నిరసనకు దిగి వచ్చిన పోలీసులు మృతుల కుటుంబ సభ్యులను కొందరిని కలుసుకునేందుకు అనుమతిచ్చారు. ఇలా ప్రియాంక యూపీ పోలీసులపై విజయం సాధించారు.

రాహుల్ రాజీనామా విషయంలో….

ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. సోదరుడు రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా ప్రియాంక గాంధీ పరిణితితో వ్యవహరించారు. రాజీనామా చేయాలంటే అంత ధైర్యముండాలని, రాహుల్ రాజీనామాను స్వాగతిస్తున్నానని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పాలి.

ఇక ప్రత్యక్షంగా…..

అప్పటి వరకూ అమేధీ, రాయబరేలీలో తల్లి, సోదరుడి తరుపున ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఉత్తరప్రదేశ్ లో నలభై నియోజకవర్గాలకు ఇన్ చార్జిగా పార్టీ తరుపున అధికారికంగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు. తరచూ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తూ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపుతున్నారు. ప్రియాంక గాంధీ ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చినట్లేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తం మీద ప్రియాంక మొండిగా ఉత్తరప్రదేశ్ లోనే ఉంటూ పార్టీ పటిష్టతకు కృషిచేస్తున్నారు.

Tags:    

Similar News