Priyanka : ఎన్నెన్ని ఆశలు… ఎన్నెన్ని సీట్లు?

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎవరి కొంపముంచనుంది? దూకుడు మీదున్న కాంగ్రెస్ ను ఈసారి యూపీ ప్రజలు ఆశీర్వదిస్తారా? అదే జరిగితే వచ్చే పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ [more]

Update: 2021-10-25 16:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎవరి కొంపముంచనుంది? దూకుడు మీదున్న కాంగ్రెస్ ను ఈసారి యూపీ ప్రజలు ఆశీర్వదిస్తారా? అదే జరిగితే వచ్చే పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ శుభారంభం చేసినట్లే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపైనే ఆశలు పెట్టుకుంది. అక్కడ కొంత పట్టు సాధించగలిగితే హస్తిన పీఠాన్ని ఆల్ మోస్ట్ స్వాధీనం చేసుకున్నట్లే. అందుకు కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తి బాధ్యతను ప్రియాంక గాంధీకి వదిలేసింది.

తేలిగ్గా తీసుకోకుండా….

గత ఎన్నికల మాదిరి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలను కాంగ్రెస్ తేలిగ్గా తీసుకోలేదు. గతంలో రాజ్ బబ్బర్ వంటి వారికి బాధ్యతలను అప్పగించి కాంగ్రెస్ అధిష్టానం ప్రాంతీయ పార్టీలపై ఆధారపడింది. కానీ ఈసారి అలా కాదు. తమ కుటుంబానికి పట్టున్న రాష్ట్రంలో తామే బాధ్యతలను తీసుకోవాలని భావించింది. గెలుపోటములన్నీ ఇప్పుడు ప్రియాంక గాంధీ ఖాతాలోనే పడతాయి. ప్రియాంక గాంధీ పూర్తిగా ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు.

ప్రతిజ్ఞ యాత్రలతో….

ఇక్కడ విజయం సాధించి సోదరుడికి ఢిల్లీ పీఠాన్ని దగ్గర చేయాలన్న ప్రయత్నంలో ప్రియాంక గాంధీ ఉన్నారు. అందుకోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నప్పటికీ ప్రియాంక గాంధీ పార్టీ మేనిఫేస్టోను అంచెలంచెలుగా విడుదల చేస్తున్నట్లు కన్పిస్తుంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ యూపీలో ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించారు. ఈ యాత్రలు మూడు వేర్వేరు రూట్లలో బయలుదేరి చివరకు ఒకటి బుందేల్ ఖండ్ కు, మరొకటి మధురకు, మరొకటి రాయబరేలీకి చేరుకుంటాయి.

ఇబ్బడి ముబ్బడిగా…

అయితే ఈ యాత్రలను ప్రారంభించే సందర్భంగా ప్రియాంక గాంధీ పార్టీ తరుపున పెద్దయెత్తున హామీలు ఇచ్చారు. ఇందులో ప్రధాన మైనది రైతు రుణమాఫీ. రైతులను ఈ హామీ విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాగే పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్ధినులకు స్మార్ట్ ఫోన్లు, డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు ఉచితంగా ఇస్తామన్నారు. గోధుమలు, వరికి 2,500లు, క్వింటాల్ చెరకుకు 400 మద్దతు ధర ఇస్తామని చెప్పారు. 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి 25 వేల ఆర్థికసాయం, కరోనా సమయంలో వాడిన విద్యుత్తు బిల్లులు రద్దు, ఇప్పుడు వస్తున్న విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిస్తామని ప్రియాంక చెప్పారు. ఇలా ప్రియాంక గాంధీ హామీలతో యూపీ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

Tags:    

Similar News