priyanka gandhi : ప్రియాంక కోసం స్పెషల్ సర్వే… అందుకేనట

ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పోటీ ఖాయమయింది. ఆమె పోటీ చేయడం ఖాయమని ఇప్పటికే పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రియాంక గాంధీ [more]

Update: 2021-09-19 16:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పోటీ ఖాయమయింది. ఆమె పోటీ చేయడం ఖాయమని ఇప్పటికే పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రియాంక గాంధీ పోటీ చేసి సునాయాసంగా విజయం సాధించడం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సర్వేను కూడా నిర్వహిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లో గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా అండగా ఉంటూ వస్తున్న రాయబరేలి, అమేధీ పార్లమెంటు పరిధిలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రియాంక గాంధీ భావిస్తున్నారు.

సీఎం అభ్యర్థిగా….

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ నుంచి వత్తిడి పెరుగుతుంది. చిన్నా చితకా పార్టీలను కలుపుకుని కూటమిగా వెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ఛాన్సులు ఉన్నాయి. దీనివల్ల యూపీలో అత్యధికంగా ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గం ఓటర్లతో పాటు దళితులు, మైనారిటీల ఓట్లను కూడా సొంతం చేసుకునే వీలుంటుంది.

దశాబ్దాలుగా…

ఉత్తర్ ప్రదేశ్ లో రాయబరేలి, అమేధీ నియోజకవర్గాలు దశాబ్ద కాలంగా గాంధీ కుటుంబానికి అండగా ఉంటున్నాయి. అయితే మొన్నటి పార్లమెంటు ఎన్నికలలో అమేధీ నుంచి రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. అయినా ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సునాయాసంగా గెలిచే నియోజకవర్గం కోసం పార్టీ నేతలు అన్వేషిస్తున్నారు.

సులువుగా గెలిచే…

యూపీ ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ ప్రధాన క్యాంపెయినర్ గా ఉండనుండటంతో ఆమె రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సి ఉంటుంది. అందుకే సులువుగా గెలిచే నియోజకవర్గం కోసం సర్వే చేయిస్తున్నారు. ఒక ప్రయివేటు సంస్థకు ఈ సర్వే బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు రాయబరేలి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశముంది.

Tags:    

Similar News