దొడ్డిదారిన ఎందుకు తల్లీ?

ప్రియాంక గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు. మొన్నటి వరకూ ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతలను చూసిన ప్రియాంక గాంధీ ఇటీవల కాలంలో దేశ రాజకీయాలపై దృష్టి [more]

Update: 2020-02-17 16:30 GMT

ప్రియాంక గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు. మొన్నటి వరకూ ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతలను చూసిన ప్రియాంక గాంధీ ఇటీవల కాలంలో దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు. సోనియా గాంధీ అనారోగ్యం పాలవ్వడంతో అన్నకు తోడుగా రాజకీయాలలో నిలుస్తున్నారు. సీఏఏ కు వ్యతిరేకంగా పోరాటంలో ప్రియాంక గాంధీ పాలు పంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన ప్రియాంక గాంధీకి ఇప్పుడు రాజ్యసభ ఇవ్వాలన్న యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.

రాజకీయాల్లోకి వచ్చినా…..

నిజానికి ఇందిరాగాంధీ పోలికలతో అచ్చు గుద్దినట్లు ఉండే ప్రియాంక గాంధీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఎప్పటి నుంచో డిమాండ్ విన్పిస్తుంది. ముఖ్యంగా గత ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో ఆమె పార్టీ బాధ్యతలను చూసినప్పటికీ అక్కడ పరాజయం పాలవ్వడంతో తొలి అడుగులోనే ఇబ్బంది ఎదురయింది. అయినా ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ ను వదలిపెట్టకుండా అక్కడ పార్టీ క్యాడర్ లో ఎప్పటికప్పుడు నూతనోత్తేజం నింపుతున్నారు.

రాజ్యసభకు పంపాలని…..

కానీ ప్రియాంక గాంధీకి ఏదో ఒక పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయింది. రానున్న రాజ్యసభ ఎన్నికలలో ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుంది. తమకు బలమున్న రాజస్థాన్ లేదా మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ల నుంచి పోటీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ పార్టీలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలంటే ఆమెను ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి దించాలని పార్టీ సీనియర్ నేతలు కూడా భావిస్తున్నారు.

రాయబరేలి నుంచి?

రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్షుడుగా రాజీనామా చేయడం, సోనియా అనారోగ్యంతో ఉండటంతో ప్రియాంక గాంధీని యాక్టివ్ చేయాలన్న భావనతో రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయిపోయారు. కానీ కొందరు ప్రియాంను రాజ్యసభకు పంపండంపై పెదవి విరుస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న రాయబరేలి స్థానం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. సోనియా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో రాయబరేలి నుంచి ప్రత్యక్షంగా లోక్ సభకు పంపాలని, దొడ్డిదారిన ఎందుకని పలువురు సీనియర్ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చినా ప్రత్యక్ష్య ఎన్నికల్లో గెలిచి వస్తే బాగుంటుందని ప్రియాంక గాంధీకి పలువురు సూచిస్తున్నారు.

Tags:    

Similar News