ఆసుపత్రులే హడలిపోతుంటే ఎలా …?

ఏపీ సర్కార్ కూడా తెలంగాణ ప్రభుత్వంలాగే కరోనా చికిత్స ను ప్రయివేట్ ఆసుపత్రులు చేసేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతే కాదు పక్క రాష్ట్రం లాగా కాకుండా [more]

Update: 2020-07-23 09:30 GMT

ఏపీ సర్కార్ కూడా తెలంగాణ ప్రభుత్వంలాగే కరోనా చికిత్స ను ప్రయివేట్ ఆసుపత్రులు చేసేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతే కాదు పక్క రాష్ట్రం లాగా కాకుండా పేదల చికిత్స కి ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ లో చేర్చింది కూడా. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే దేవుడు దయ తలచినా పూజారి కరుణించడం లేదు ఎపి లో. కరోనా కి ఇప్పటికే అనేకమంది వైద్యులు బలి కావడం ఇందులో ప్రయివేట్ ఆసుపత్రి వైద్యులు సైతం ఉండటం ఇంకా పలువురు వైరస్ సోకి చికిత్స పొందుతూ ఉండటంతో పలు సమస్యలు వచ్చి పడ్డాయి.

వెనుకాడుతున్న వైద్యులు …

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చాలా ఆసుపత్రులు క్లోజ్ చేసుకుని వైద్యులు సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్లిపోయారు. రోజు రోజు కు కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో కొందరు హడలిపోతున్నారు. మరికొన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లో ఉన్నప్పటికి కరోనా కేసులకు చికిత్స అందిస్తే సాధారణ రోగులు దూరం జరుగుతారని ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కు అవసరమైన ప్రత్యేక వార్డ్ లు వెంటిలేటర్ లు వంటి అన్ని సౌకర్యాలు లేవు. దాంతో వారు వైరస్ కేసులను ఇప్పటికిప్పుడు చేర్చుకునే పరిస్థితి లేదు.

త్వరలో కొన్ని రెడీ …

అయితే త్వరలో కొన్ని ప్రయివేట్ ఆసుపత్రులు సర్వ సౌకర్యాలతో సిద్ధం అయ్యి వైరస్ కి చికిత్స అందించేందుకు సై అంటున్నాయి. విశాఖ, విజయవాడ వంటి ప్రాంతాల్లో కొన్ని ప్రధాన ఆసుపత్రులు మాత్రమే పాజిటివ్ కేసులను ట్రీట్ చేస్తున్నాయి. దాంతో కేసుల సంఖ్య భారీగా పెరిగేలోగా ఎపి లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జనాభాకు సరిపడా వైద్యం అందించలేకపోతు ఉంటే ఎపి ఎలా ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దేనికైనా రెడీ అంటున్న జగన్ సర్కార్ …

అయితే జగన్ సర్కార్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇప్పటికే అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో అన్నిరకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమైందని అధికార వర్గాలు అంటున్నాయి. స్వల్ప లక్షణాలు ఉన్నవారికి హోమ్ క్వారంటైన్ లోనే చికిత్స కు ఇప్పటికే కిట్లు అందించేందుకు సర్కార్ రెడీ అయ్యింది. ఈ ఫార్ములా లోనే టి సర్కార్ కూడా తాజాగా ప్రకటన చేయడం విశేషం. వెంటిలేటర్, అవసరం అయినవారికి పెద్ద వయస్సు వారికి తప్ప ఆసుపత్రికి అవసరం లేదన్నది ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచనగా ఉంది. ఇలా చేస్తే వైద్య వర్గాలపై దీంతో వత్తిడి బాగా తగ్గుతుందని నిపుణుల అంచనా.

Tags:    

Similar News