అడ్రస్ గల్లంతయిందే

కాంగ్రెస్ గెలువలేదు…….కమలం వికసించలేదు…….. టీడీపీ ఊసే లేదు…… ఇదీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తేలిన ఫలితం.   సిట్టింగ్ కు ఫిట్టింగ్ పెట్టారు…. ఎన్నికలకు ముందు [more]

Update: 2019-10-24 09:30 GMT

కాంగ్రెస్ గెలువలేదు…….కమలం వికసించలేదు…….. టీడీపీ ఊసే లేదు…… ఇదీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తేలిన ఫలితం.

 

సిట్టింగ్ కు ఫిట్టింగ్ పెట్టారు….

ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ఉదరగొట్టాయి. కాంగ్రెస్ విజయం తమదే నంటూ విజయఢంకా మోగించింది. సిట్టింగ్ స్థానం తమదేనని, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలిపిస్తాయని వక్కానించింది. రోజుకో తీరుగా రోజుకో నాయకుడు తిరిగి ప్రచారం చేశారు. కాని ఎంత చేసినా చతికలపడింది కాంగ్రెస్ 30వేల ఓట్ల వెనుకంజలోనే నిలిచిపోయింది. ఉత్తమ్, వి.హెచ్, జానా, రేవంత్ ఇలా హేమా హేమీలు ప్రచారం చేసినా కలిసిరాలేదు.

కానరాని మోడీ చరిష్మా…

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర నేతలు హుజూర్ నగర్ లో జోరుగా ప్రచారంచేశారు. మోడీ చరిష్మా పనిచేస్తుందని భావించారు. కాని కమలం వికసించలేకపోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కని స్థాయిలో కిందపడిపోయింది. మోడీ, అమిత్ షాల పేర్లతో ప్రచారం చేసినా ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు.

జోష్ లేదే…..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ చాలా వీక్ అయ్యింది. మళ్లీ పుంజుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసింది. ఉప ఎన్నికలో టీడీపీ శ్రేణులకు జోష్ నింపేందుకు అధినేత చంద్రబాబు అభ్యర్థిని నిలబెట్టారు. మళ్లీ పూర్వ వైభవం కోసం తమ సత్తా చాటాలనుకున్నారు. కనీసం ఆ ఛాయలు కూడా కానరాలేదు. ఉపఎన్నికల్లో టీడీపీ, బీజీపీల అడ్రస్ గల్లంతయ్యింది. డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితికి టీడీపీ పడిపోయింది.

సానుభూతి వచ్చిందా…….

టి.ఆర్.ఎస్ విజయఢంకా మోగించింది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత, ఆర్టీసీ సమ్మె వంటి అస్త్రాలు ఎన్ని ప్రతిపక్షాలు ఉపయోగించినా ఆ ప్రయోగాలేమి ఫలించలేదు. గత ఎన్నికల్లో సైదిరెడ్డి ఓడిపోవడం పట్ల స్థానిక ప్రజల్లో కొంత సానుభూతి వచ్చింది. సైదిరెడ్డి ఓడిపోయినా ప్రజలతోనే కలిసి ఉన్నారు. వారి సమస్యలను తీర్చేందుకు తన వంతు కృషి చేశారు. ఓడిన నాటి నుంచే ప్రచారం దిశగా పనిచేశారు సైదిరెడ్డి. దీనికి తోడు అధికార పార్టీ గెలిస్తే హుజూర్ నగర్ అభివృద్ధి అవుతుందని జనం ఆలోచించారు. 30 ఏళ్లు కాంగ్రెస్ కు వేశాం…. ఈ సారి ఛాన్స్ సైదిరెడ్డికి ఇద్దామనే రీతిలో కారుకే ఓటేశారు. దీంతో సైదిరెడ్డి భారీ విజయం సాధించారు.

 

 

Tags:    

Similar News