మోడీ నో చెప్పే ఛాన్సే లేదటగా

ఏపీ ఏ విషయంలో ఏమి కోరినా నో అంటారేమో కానీ శాసనమండలి రద్దు బిల్లుకు మాత్రం మోడీ ఓకే అంటారని ప్రచారం ఒకటి సాగుతోంది. దేశంలో ఇపుడు [more]

Update: 2020-01-25 11:00 GMT

ఏపీ ఏ విషయంలో ఏమి కోరినా నో అంటారేమో కానీ శాసనమండలి రద్దు బిల్లుకు మాత్రం మోడీ ఓకే అంటారని ప్రచారం ఒకటి సాగుతోంది. దేశంలో ఇపుడు కేవలం ఆంధ్రప్రదేశ్ తో కలిపి ఆరు రాష్ట్రాల్లోనే మండలి ఉంది. తెలంగాణా, కర్నాటక. మహారాష్ట్ర. బీహార్, ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ఇవి ఉన్నాయి. ఇక ఏపీలో మండలిని ఎత్తివేయాలని అసెంబ్లీ తీర్మానం చేసై పంపిస్తే ఈ బడ్జెట్ సెషన్లోనే మోడీ ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దానికి కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

గతంలో అలా…

నిజానికి మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్ళ క్రితం మండలి అవసరం ఉందా? లేదా? అన్న దాని మీద రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరినట్లుగా చెబుతున్నారు. ఆనాటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మండలి కావాలని చెప్పారట. ఇక దేశంలో మండలి రద్దు అయిన చోట్ల కొత్తగా రాజస్థాన్, అస్సాం, ఒడిశా వంటివి పునరుధ్ధరణకు కోరుతున్నా కేంద్రం మాత్రం సుముఖంగా లేదట. అంటే ఉన్న వాటిని రద్దు చేయడం మీదనే మోడీ సర్కార్ కి కూడా ఒక ఆలోచన ఉన్నట్లుగా తేలుతోంది.

పునరావాసాలే…..

శాసనమండలి అంటే ఒకపుడు మేధావులు, విద్యావంతులు ఉండేవారు. ఇపుడు మాత్రం అక్కడ రాజకీయ పునారావసంగా కొందరికి మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా తిరస్కరించబడిన వారు అక్కడికి చేరి మంత్రులై జనం ముందుకు వస్తే ఆ నగుబాటు ప్రజాస్వామ్యానిదే. ఈ విచక్షణ లేకుండా తమకు కావాల్సిన వారు అంటూ ఏలికలు వారిని పెద్దల సభలో కూర్చోబెట్టి మరీ ఆమాత్యులను చేస్తున్నారు. ఇక మండలిలో ఒకప్పటి మాదిరిగా అర్ధవంతమైన చర్చలు లేవు. అక్కడ కూడా వీరావేశాలు, విచిత్ర విన్యాసాలు ఉన్నాయి. దాంతో మండలి మీద జనంలో ఎప్పటి నుంచో రోత ఉంది. ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ మండలి విషయంలో అభిప్రాయ సేకరణ జరిపింది. దేశంలో ఆరు రాష్ట్రాలు తప్ప ఎక్కడా ఈ వ్యవస్థలు లేకపోవడం అంటే భవిష్యత్తులో ఇవి ఎక్కడో ఒక చోట ఆగిపోతాయని అందరికీ తెలిసిపోతోంది.

జగన్ దూకుడు…..

ఇక జగన్ విషయం తీసుకుంటే మండలిని ఎలాగైన రద్దు చేయాలనుకుంటున్నారు. ఆయనకు అక్కడ యనమల రామకృష్ణుడు, లోకేష్ వంటి వారిని చూడడం బహు కష్టంగా ఉందిట‌. పైగా మరో రెండేళ్ళ వరకూ ఈ బాధలు మండలి నుంచి తప్పవన్న భయమూ, బెంగా ఉన్నాయి. దీంతో ఎలాగైనా రద్దు చేయాలన్నదే ఆయన ఆలోచన. దాంతో ఎంత వేగంగా రద్దు బిల్లుని కేంద్రానికి పంపించి అంత తొందరగా తలుపులకు తాళాలు వేయించాలని ఆలోచన చేస్తున్నాడు. దీనికి ఇపుడున్న పరిస్థితుల్లో అయితే మోడీ సర్కార్ ఆపదని, రద్దుకు ఒకే అంటుందని అంటున్నారు. టీడీపీ సైతం కేంద్రం ఆపదని, కాకపోతే ఆలస్యం అవుతుందన్న ధోరణిలోనే మాట్లాడుతోంది. కానీ ఈసారి బడ్జెట్ సెషంలోనే శాసనమండలి రద్దు జరిగిపోవచ్చునన్న మాట గట్టిగా ఢిల్లీ సర్కిల్స్ నుంచి వినిపిస్తోంది. దీంతో మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ బాటలో నడిచినా అక్కడ కూడా శాసనమండలిని రద్దు చేసేందుకు పచ్చ జెండా ఊపేందుకు కేంద్రం రెడీగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News