4.0 లాక్ డౌన్… అన్నీ ఓపెన్.. అవి తప్ప?

నాలుగో విడత లాక్ డౌన్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ 4.0 లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే గత మూడు [more]

Update: 2020-05-13 17:30 GMT

నాలుగో విడత లాక్ డౌన్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ 4.0 లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే గత మూడు లాక్ డౌన్ లకు భిన్నంగా నాలుగో విడత లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. నాలుగో విడత లాక్ డౌన్ గత లాక్ డౌన్ లకంటే ఎక్కువ మినహాయింపులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది.

రెండు నెలలు దాటుతోంది……

ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా భారత్ లో లాక్ డౌన్ విధించి రెండు నెలలు దాటుతోంది. లాక్ డౌన్ దాదాపుగా అన్ని మూత పడ్డాయి. కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆదాయాలను కోల్పోయాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రధాని మోదీ మాటల్లోనే కరోనా దీర్ఘకాలం ఉంటుందని చెప్పారు. అలా అని మనం ఇంట్లోనే కూర్చుంటే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని కూడా పరోక్ష సంకేతాలు ఇచ్చారు. కరోనాను జయించేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని పిలుపు నివ్వడం వెనక కూడా ఈసారి ఎక్కువ మినహాయింపులు ఉంటాయంటున్నారు.

మూడో విడతలో కొన్ని…..

కరోనా కారణంగా తొలి రెండు లాక్ డౌన్ లలో ఎలాంట దుకాణాలకు అనుమతి ఇవ్వలేదు. ప్రజా రవాణాను పూర్తిగా స్థంభింప చేశారు. రాష్ట్రాల సరిహద్దులను మూసి వేసశారు. మూడో విడత లాక్ డౌన్ లో ప్రభుత్వాలకు ఆదాయాన్ని తెచ్చి పెట్టే మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారు. వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించారు. పరిమిత సంఖ్యలో రైళ్ల రాకపోకలను కూడా పునరుద్ధరించారు. దీంతో రాష్ట్రాలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి.

ఈసారి పూర్తిగా…

రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి మినహాయింపులు ఇచ్చారు. నాలుగో విడత లాక్ డౌన్ లో జిల్లా వారీగా కాకుండా పరిమిత ప్రాంతాన్నే రెడ్ జోన్ గా చేయాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీంతో పాటు అన్ని దుకాణాలకు అనుమతిచ్చే అవకాశముంది. ప్రజా రవాణా వ్యవస్థకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా కేసులు ఎక్కువ గా ఉన్న ప్రాంతాల్లోనే ఆంక్షలు విధించి మిగిలిన ప్రాంతాల్లో పూర్తిగా సడలించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ప్రార్థనలు, మత మందిరాలు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లకు మాత్రం ఇప్పుడప్పుడే అనుమతి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మార్గదర్శకాలు వెలువడనున్నాయి.

Tags:    

Similar News