రాజధాని అసలు లేదటగా

ఏపీకి రాజధాని ఏంటి అంటే తెలుగు తమ్ముళ్ళు అమరావ‌తి అని ఠక్కున చెబుతారు. ఇక చంద్రబాబు అయితే బంగారు బాతు గుడ్డు లాంటి అమరావతిని వైసీపీ పాలకులు [more]

Update: 2019-11-06 14:30 GMT

ఏపీకి రాజధాని ఏంటి అంటే తెలుగు తమ్ముళ్ళు అమరావ‌తి అని ఠక్కున చెబుతారు. ఇక చంద్రబాబు అయితే బంగారు బాతు గుడ్డు లాంటి అమరావతిని వైసీపీ పాలకులు చంపేశారని తెగ బాధపడుతుంటారు. అంటే టీడీపీకి అమరావతి రాజధానిగా ఉంది. ఇక జనసేన పార్టీకి కూడా అమరావతి రాజధానిని మార్చకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు ప్రతిపక్షాలు అన్నీ కూడా అమరావతి రాజధాని ఏం చేస్తున్నారంటూ జగన్ మీద దండెత్తాయి కూడా. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ బీజేపీ సైతం అమరావతి రాజధానిని కదిలిస్తే ఊరుకునేది లేదంటూ గట్టి ఆదేశాలే జారీ చేసింది. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా అమరావతి పేరు వల్లిస్తూంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ మాత్రం ఏపీకి రాజధాని అన్నదే లేదని తేల్చెసింది.

మ్యాప్ లో కనిపించని అమరావతి….

కేంద్రం తాజాగా విడుదల చేసిన భారతదేశం కొత్త మ్యాప్ లో అన్ని రాష్ట్రాలకు రాజధానులు, పిన్ కోడ్ నంబర్లూ ఉన్నాయి. ఏపీ విషయానికి వచ్చేసరికి రాజధాని అన్నదే లేకుండా పోయింది. కేవలం ఏపీ అంటూ వదిలేశారు. కనీసం విజయవాడను కూడా రాజధానిగా పేర్కొనపోవడం విడ్డూరమే. చిత్రమేంటంటే అమరావతి రాజధాని శంఖుస్థాపనకు ప్రధాని హోదాలో మోడీ 2015 అక్టోబర్ 22న వచ్చారు. బ్రహాండమైన రాజధానికి తన సాయం ఉంటుందని చెప్పి వెళ్లారు. మరి ఏపీ బీజేపీ నేతలైనా గుర్తు చేయలేదో ఏమో కానీ కొత్త మ్యాప్ లో అమరావతి రాజధాని కనుమరుగు అయిపోయింది.

ఎవరికి అవమానం….

అయిదేళ్ల చంద్రబాబు సర్కార్ రాజధాని పేరిట హడావుడి చేసింది కానీ చివరికి తాత్కాలిక కట్టడాలతోనే కధ ముగించింది. కేంద్రం ఇచ్చిన 1600 కోట్లను కూడా వేరేగా వాడేసిందని విమర్శలు ఉన్నాయి. ఇక బాబు దిగిపోయి జగన్ వచ్చి ఆరో నెల ప్రవేశించినా రాజధాని విషయంలో ఎటూ తేల్చడంలేదు. అమరావతి ఉంటుందా, ఉండదా అన్నది కూడా జగన్ సర్కార్ చెప్పలేకపోతోంది. మరో వైపు నిర్మాణాలు కూడా అక్కడ ఏమీ జరగడంలేదు. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు కేంద్రం అవమానించిందనే అనిపిస్తుంది. దానికి మన పాలకులే కారణం అని కూడా అనిపిస్తుంది. దేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రంగా జాతీయ స్థాయిలో నిలబడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇపుడు జగన్ చేతిలో అధికారం ఉంది. మంచి అవకాశం ఉంది. తొందరగా ఏపీ రాజధానిని అభివ్రుధ్ధి చేసి దేశం ముందు ఆంధ్రులు తలెత్తుకునేలా వ్యవహరించాలని అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News