ట్రైలర్ ఒకే..మూవీ ఎలా చూపిస్తారో?

వంద రోజుల పాలన తరువాత ప్రధాని నరేంద్రమోడీ ఒక మాట అన్నారు. ఇపుడు చూసినదంతా ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందు ఉంది అని. నిజానికి ట్రైలర్ [more]

Update: 2019-09-17 18:29 GMT

వంద రోజుల పాలన తరువాత ప్రధాని నరేంద్రమోడీ ఒక మాట అన్నారు. ఇపుడు చూసినదంతా ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందు ఉంది అని. నిజానికి ట్రైలర్ లోనే అదరగొట్టే ఎన్నో సీన్లు దట్టించేశారు. అయిదేళ్ళు కాదు, డెబ్బయ్యేళ్లలోనూ చేయలేని పనులు చేసి చూపించారు. అందులో అగ్ర తాంబూలం కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి 370 ని రద్దు చేయడం. నిజంగా మోడీ ఛాతీ చాలా విశాలం అని రుజువు చేసిన సందర్భం అది. ఇక ట్రిపుల్ తలాక్ కూడా మోడీ మరో డేరింగ్ స్టెప్. దేశంలోని కీలమైన జాతీయ బ్యాంకులను విలీనం చేస్తూ తీసుకున్న మరో అతి పెద్ద నిర్ణయం కూడా ట్రైలర్ లో పార్ట్ గానే చూడాలి. ఇలా వంద రోజుల పాలన మొత్తం ఆసక్తిగా ఉంది.

సినిమా హిట్టేనా…?

నిజానికి ట్రైలర్ కి సినిమాకు ఎపుడూ పొంతన ఉండదంటారు. మంచి సీన్లు ఏర్చి కూర్చి ట్రైలర్ గా ప్యాక్ చేసి వదులుతారు. అది ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం. దాంతో ఫిదా అయిన జనం ధియేటర్లకు వెళ్తే అసలు సినిమా బోర్ కొట్టించవచ్చు. కొన్ని సార్లు అంతకంటే కూడా బాగుండవచ్చు. ఇపుడు మోడీ ట్రైలర్ మాత్రం సూపర్ హిట్. అసలు మూవీ అంటే ఇంకా 55 నెలలు పై దాటి ఉంది. మరి ఆ సమయంలో ఏం చేస్తారు, ఎన్ని అద్భుతాలు చూపిస్తారన్నది చెప్పాలంటే పెద్ద చర్చ అవుతుంది. మోడీ మదిలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. జనసంఘ్ నాటి నుంచి బీజేపీలో, ఆర్ఎస్ఎస్ లో కూడా ఎన్నో వూహలు ఉన్నాయి. వాటిని గుదిగుచ్చి మోడీ రానున్న అయిదేళ్లలో డేరింగ్ డెసిషన్లు తీసుకుంటారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి.

హాట్ టాపిక్ గా….

ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలి పదేళ్ళు రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాగా సాహెబ్ అంబేద్కర్ ఆలొచన చేశారు. అంతకు మించి వాటిని కొనసాగనివ్వవద్దు అని కూడా అన్నారు. కానీ రాజకీయంగా లాభాలను కోరుకునే పార్టీల మూలంగా ఇప్పటికీ రిజర్వేషన్లు దేశంలో కొనసాగుతున్నాయి. దీని మీద కూడా అనేక రకాలుగా చర్చ ఉంది. అనుకూలం, ప్రతికూలంగా కూడా చర్చలు ఉన్నాయి. ఇపుడు మోడీ రిజర్వేషన్ల జోలికి వెళ్తారా అన్న ఆలోచన కూడా అందరిలో వస్తోంది. ఎందుకంటే బేసికల్ గా ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం. సంఘ్ నేతలు తమ అభిప్రాయాన్ని ఎప్పటికపుడు చెప్పుకొచ్చారు కూడా. ఒకవేళ కదిపితే అది తేనెతుట్టె అవుతుందా లేక మోడీ మ్యాజిక్ తో ఆటోమాటిక్ గా దారికి వచ్చెస్తుందా అన్నది చూదాలి. అదే విధంగా అయోధ్యలో రామాలయం కూడా మోడీ మరో పెద్ద ప్రొగ్రాం. దీంతో పాటు అమిత్ షా అంటున్నట్లుగా ఒకే భాష. ఒకే కల్చర్ ఇలా చాలా ఉన్నాయి. మరి మోడీ సినిమాలో ఎంతమేరకు ఈ సీన్లు పండుతాయో చూడాలి.

Tags:    

Similar News