ఆగే అవకాశమే లేదట.. పళని పరిస్థితి ఏంటి?

తమిళనాడులో కరోనా కేసుల వ్యాప్తి ఆగడం లేదు. లాక్ డౌన్ ను మళ్లీ విధించినా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. [more]

Update: 2020-06-27 17:30 GMT

తమిళనాడులో కరోనా కేసుల వ్యాప్తి ఆగడం లేదు. లాక్ డౌన్ ను మళ్లీ విధించినా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. దేవుడే చూసుకోవాలని అని ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమిళనాడులో కరోనా వైరస్ భయపెడుతోంది. గత కొన్నాళ్లుగా రోజుకు రెండువేలకు పైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్…..

తమిళనాడులో ప్రస్తుతం కేసుల సంఖ్య 66 వేలకు దాటిపోయాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది. మరణాలు కూడా వెయ్యికి చేరువలో ఉన్నాయి. తమిళనాడులో ప్రతి జిల్లాలోనూ కరోనా వైరస్ ఉంది. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ ను విధించింది. కరోనా వైరస్ ను కంట్రోల్ చేయలేక విధిలేని పరిస్థితుల్లో లాక్ డౌన్ ను విధిస్తున్నామని,ప్రజలు సహకరించాలని పళనిస్వామి విజ్ఞప్తి చేశారు.

రెట్టింపు అవుతాయట…..

తమిళనాడు ప్రభుత్వం కరోనా వైరస్ అధ్యయనం చేయించింది. 16 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని ఈ అధ్యయనంలో తేలడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. అందుకే అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ మళ్లీ విధించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. మొత్తం నమోదయిన కేసుల్లో 60 శాతానికి పైగానే ఇక్కడ కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

రాజకీయంగా కూడా….

ఇక కరోనా రాజకీయంగా కూడా పళనిస్వామికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే డీఎంకే ఎమ్మెల్యే కరోనా కారణంగా మృతి చెందారు. మంత్రికి కూడా కరోనా సోకిందని ప్రచారం జరిగింది. అయితే కేసుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతుందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చేతకాని తనం కారణంగానే కరోనాను కట్టడి చేయలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కరోనా అధికార పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తుందనే చెప్పాలి.

Tags:    

Similar News