Andhra : రాననుకున్నారా? రాలేనని అనుకున్నారా?

ఎన్నికలకకు సమయం దగ్గరపడుతుండటం, ఏపీలో రాజకీయ పరిణామాలు క్రమంగా మారిపోతుండటంతో టీడీపీ నేతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. నిన్న మొన్నటి వరకూ నియోజకవర్గానికి దూరంగా ఉంటూ, వ్యాపారాలకే [more]

Update: 2021-10-28 13:30 GMT

ఎన్నికలకకు సమయం దగ్గరపడుతుండటం, ఏపీలో రాజకీయ పరిణామాలు క్రమంగా మారిపోతుండటంతో టీడీపీ నేతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. నిన్న మొన్నటి వరకూ నియోజకవర్గానికి దూరంగా ఉంటూ, వ్యాపారాలకే పరిమితమైన నేతలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చిలకలూరి పేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూడా వారిలో ఒకరు.

రెండేళ్ల పాటు…

ఆయన ఈ మధ్య కాలంలోనే నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్ లో భరోసా నింపుతున్నారు. 2019 ఎన్నికల్లో తాను ఓటమి పాలవుతానని ప్రత్తిపాటి పుల్లారావు ఊహించలేదు. మంత్రిగా ఐదేళ్ల పాటు తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని కూడ పట్టించుకోలేదని ఆయన వాపోయేవారు. అందుకే నియోజకవర్గానికి దూరంగా దాదాపు రెండేళ్ల పాటు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ప్రత్తిపాటి పుల్లారావు పెద్దగా పట్టించుకోలేదు. ఫోన్ లోనే ముఖ్యమైన నేతలతో మంతనాలు జరిపేవారు.

యాక్టివ్ అయి….

దీనికి తోడు ప్రత్తిపాటి పుల్లారావు పై రాజధాని కేసుల కూడా నమోదయ్యాయి. ఈ కారణంగా ఆయన రాజకీయాలకు బాగా దూరంగా ఉన్నారు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ లో విభేదాలు తలెత్తడం, టీడీపీ పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని సంకేతాలు ఇవ్వడం వంటి వాటితో ప్రత్తిపాటి పుల్లారావు తిరిగి యాక్టివ్ అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

క్యాడర్ తో సమావేశాలు….

మండలాల వారీగా నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు, బాధితుల జాబితాను తీసుకుని వారిని ఊరడించే ప్రయత్నం ప్రత్తిపాటి పుల్లారావు మొదలు పెట్టారు. నిన్న మొన్నటి వరకూ నేత లేకుండా లబోదిబోమన్న క్యాడర్ ప్రత్తిపాటి రాకతో ఉత్సాహంతో ఉరకలేస్తుంది. మొత్తం మీద ఇన్నాళ్లు పొరుగు రాష్ట్రానికే పరిమితమైన నేతలు ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో కనిపిస్తుండటం పార్టీ అధినేతకు ఊరటనిచ్చే అంశమే.

Tags:    

Similar News