ప్ర‌త్తిపాటికి షాక్ ఇవ్వనున్నారా?

ప్ర‌త్తిపాటి పుల్లారావు సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గజం. టీడీపీలో తిరుగులేని నేత‌గా ఎదిగిన నాయ‌కుడు. చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడుగా పార్టీలో ఎదిగారు. వ‌రుస‌గా గుంటూరు జిల్లా [more]

Update: 2019-10-07 03:30 GMT

ప్ర‌త్తిపాటి పుల్లారావు సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గజం. టీడీపీలో తిరుగులేని నేత‌గా ఎదిగిన నాయ‌కుడు. చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడుగా పార్టీలో ఎదిగారు. వ‌రుస‌గా గుంటూరు జిల్లా చిల‌కలూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపుగుర్రం ఎక్కిన నేత‌. 2009, 2014లో ఇక్క‌డ టీడీపీ జెండాను ఎగుర వేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు కేబినెట్‌లో సీటు కూడా ఇచ్చారు. ప‌దేళ్ల పాటు పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా ముందుండి న‌డిపించారు. ఈ క్రమంలోనే బాబు ఆయ‌న‌కు ఐదేళ్ల పాటు మంత్రి ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టారు.

ప్రత్తిపాటి భార్యపై….

క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ సునామీ నేప‌థ్యంలో ఈయ‌న కూడా ఓట‌మిపాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఊపు చూపి స్తున్నారు. పార్టీ పిలుపు ఇచ్చిన ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ పాల్గొంటున్నారు. పార్టీ నిర్వ‌హిస్తున్న స‌మావేశాల‌కు కూడా హాజ‌ర‌వుతున్నారు. అయితే, ఇప్పుడు ఆయ‌న పార్టీలో ఒంట‌రి అవుతున్నారా? అనే సందేహం ఎందుకు వ‌స్తుంది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. దీనికి రీజ‌న్‌.. గ‌డిచిన వారం రోజులుగా ప్ర‌త్తిపాటి స‌తీమ‌ణి తేనె వెంకాయ‌మ్మ పై కేసులు న‌మోదు చేసేందుకు చిల‌క‌లూరి పేట పోలీసులు పావులు క‌దుపుతున్నార‌ని తెలుస్తోంది.

వీట్యాక్స్ ను బయటకు తీసి…..

ఆమె గ‌తంలో త‌న భ‌ర్త మంత్రిగా ఉన్న స‌మ‌యంలో స్థానికంగా ఉన్న వ్యాపారుల‌ను బెదిరించి వ‌సూళ్ల ప‌ర్వానికి తెర‌దీసింది. వాస్త‌వంగా ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్న‌ప్పుడు పేట‌లో వీ ట్యాక్స్ పాపుల‌ర్ అయ్యింది. వీ అంటే వెంకాయ‌మ్మ ట్యాక్స్ అని అర్థం. తాజాగా వారం రోజుల కింద‌ట స్థానిక ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ ఇక్క‌డి వ్యాపారుల‌తో స‌మావేశ‌మైన‌ప్పుడు ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తాము ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చామ‌ని.. ఇప్పుడు ఇవ్వ‌లేమ‌ని వారు చెప్పారు. దీంతో దూకుడు ప్ర‌ద‌ర్శించిన విడ‌ద‌ల ర‌జ‌నీ.. ఎవ‌రెవ‌రి నుంచి వెంకాయ‌మ్మ ఎంత మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేసిందో వివ‌రాలు సేక‌రించి పోలీసుల‌కు ర‌హ‌స్యంగా చేర‌వేశార‌ని, దీనిపై ప్ర‌స్తుతం పోలీసులు దృష్టి పెట్టార‌ని అంటున్నారు.

చంద్రబాబును అడిగినా….

అంతేకాదు, ఆనోటా ఈనోటా.. ఈ విష‌యంమాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయ‌న హ‌డావుడిగా ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు దృష్టికి తీసుకు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్పాయింట్‌మెంట్ అడిగార‌ని స‌మాచారం. అయితే, ఇప్పుడు తాను బిజీగా ఉన్నాన‌ని, త‌ర్వాత చూద్దామ‌ని, కేసులు బుక్క‌య్యాక మాట్లాడుకుందామ‌ని ఎదురు దాడి చేద్దామ‌ని త‌న‌దైన శైలిలో త‌ప్పించుకున్నార‌ట చంద్ర‌బాబు. దీంతొ ఇప్పుడు పుల్లారావు త‌ల‌ప‌ట్టుకున్నార‌ని స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News