ప్రస్థానం ముగిసినట్లేనా?

జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ నుంచి వైదొలగనున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ జేడీయూకు దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. [more]

Update: 2020-01-28 17:30 GMT

జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ నుంచి వైదొలగనున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ జేడీయూకు దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణాలు పౌరసత్వ చట్ట సవరణ. గత కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ సీఏఏకు వ్యతిరేకంగా, బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. బీహార్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జేడీయూలు కలసి పోటీ చేయాలని ఒప్పందం కుదిరినప్పటికీ ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీని వదలిపెట్టడం లేదు.

నితీష్ కు ఇబ్బందే…..

దీంతో నితీష్ కుమార్ కు ఇబ్బందిగా మారింది. ప్రశాంత్ కిషోర్ ను నితీష్ కుమార్ కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది. రాజ్యసభ, పార్లమెంటులో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు తెలిపింది. అయినా నితీష్ కుమార్ మాత్రం బీహార్ లో సీఏఏను అమలు పర్చబోమని చెప్పేశారు. దీనికి వ్యతిరేకంగా త్వరలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని కూడా ప్రకటించారు.

బీజేపీని ఇబ్బంద పెట్టే విధంగా…..

అయినా ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నారు. ఇది కూడా నితీష్ కుమార్ ను ఇబ్బంది పెట్టే అంశంగానే మారింది. బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రశాంత్ కిషోర్ వ్యవహారశైలితో బీజేపీ దూరం జరుగుతుందనే భావన నితీష్ కుమార్ లో ఏర్పడింది.

ఉండే ఛాన్స్ లేదంటూ…..

దీంతో నితీష్ కుమార్ పార్టీ ఉపాధ్యక్షుడు అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఉండాలనుకుంటే ఉండవచ్చని, ఇష్టం లేకుంటే వెళ్లవచ్చని నితీష్ కుమార్ సీరియస్ గా వ్యాఖ్యానించారు. జేడీయూ నిబంధనల మేరకే నడుచుకోవాలని పరోక్ష హెచ్చరికలు కూడా ప్రశాంత్ కిషోర్ కు జారీ చేశారు. ప్రశాంత్ కిషోర్ కూడా అదే రీతిలో సమాధానమిచ్చారు. తాను బీహార్ వచ్చి సమాధానం చెబుతానని ధీటుగానే సమాధానమిచ్చారు. దీంతో జేడీయూలో ప్రశాంత్ కిషోర్ ప్రస్థానం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News