ప్రశాంత్ కిషోర్ పని మరింత సులువయిందట

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చేతినిండా పని పడింది. వరస ఎన్నికలు ఆయనకు, ఆయన టీంకు క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. వరసగా ఆంధ్రప్రదేశ్ , [more]

Update: 2021-05-28 16:30 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చేతినిండా పని పడింది. వరస ఎన్నికలు ఆయనకు, ఆయన టీంకు క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. వరసగా ఆంధ్రప్రదేశ్ , ఢిల్లీలో తాను వ్యూహాకర్తగా పనిచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో ఆయన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస తరుపున ప్రశాంత్ కిషోర్ పనిచేశారు.

ఎన్నికలు పూర్తి కావడంతో….

తమిళనాడు ఎన్నికలు పూర్తయ్యాయి. అక్కడ తాను వ్యూహకర్తగా వ్యవహరించిన డీఎంకే అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ లోనూ తృణమూల్ కాంగ్రెస్ దే మళ్లీ అధికారం అని ముందస్తు సర్వేలు తేల్చి చెప్పాయి. ప్రశాంత్ కిషోర్ కూడా టీఎంసీ విజయంసై ఫుల్లు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బీజేపీకి రెండంకెల స్థానాలను మించితే తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటానని కూడా సవాల్ విసిరారు.

పంజాబ్ కు షిప్ట్….

ఈ రెండు ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పంజాబ్ ఎన్నికలపై దృష్టి పెట్టనున్నారు. మే 2వ తేదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ పంజాబ్ కు షిఫ్ట్ అవ్వనున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిషోర్ ను ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం పంజాబ్ లో పని ప్రారంభించిందని చెబుతున్నారు.

ఇక్కడ ఈజీ అట….

117 స్థానాలున్న పంజాబ్ లో మరోసారి కాంగ్రెస్ కే అవకాశాలున్నాయంటున్నారు.రైతు చట్టాలు ఆ రాష్ట్రంలో బీజేపీకి ఇబ్బందికంగా మారనున్నాయి. మిత్రపక్షమైన శిరోమణి అకాలీ దళ్ సయితం వైదొలగడంతో బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తుంది. దీంతో ప్రశాంత్ కిషోర్ పని పంజాబ్ లో చాాలా సులవుయిందంటున్నారు. మొత్తం మీద వరస రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తూ ప్రశాంత్ కిషోర్ తన పొలిటికల్ రేటింగ్ ను పెంచుకుంటూ పోతున్నారు.

Tags:    

Similar News